- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒంట్లో ఓపిక లేకున్నా ఆ పని చేయక తప్పడం లేదు.. నటి షాకింగ్ కామెంట్స్
దిశ, సినిమా: యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించిన యాంకర్ విష్ణుప్రియ ప్రస్తుతం నటిగా ఫుల్ బిజీ అయిపోయింది. ఈ బ్యూటీ కెరీర్ స్టార్టింగ్ లో పలు షార్ట్ ఫిల్మ్ లో నటించింది. తర్వాత యాంకర్ గా తన మాటలతో బుల్లితెర ప్రేక్షకులను కట్టిపడేసింది. ప్రముఖ కామెడీ జబర్దస్త్ షో లో పాల్గింది. అంతేకాకుండా గత ఏడాది పవన్ సాధినేని తెరకెక్కించిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో నటించి.. ప్రేక్షకుల వద్ద మంచి మార్కులు కొట్టేసింది.
హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయిన ఈ వెబ్ సిరీస్ కు అవార్డు కూడా రావడం విశేషం. జేడీ చక్రవర్తి ముఖ్య పాత్రలో నటించిన ఈ సిరీస్ కు సీక్వెల్ రానుందని టాక్ వినిపించింది. కానీ దీనిపై ఎటువంటి ప్రకటన లేదు. ఇదంతా పక్కన పెడితే విష్ణుప్రియ కొద్ది రోజుల నుంచి ఎక్కడా కనిపించడం లేదు. దీంతో పలువురు జనాలు.. అనారోగ్యానికి గురైందేమో, లేక బుల్లితెర, వెండితెర పై అవకాశాలు రావడం లేదేమో అంటూ సోషల్ మీడియాలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే తాజాగా విష్ణు ప్రియ నెట్టింట ఓ ఆసక్తికర కామెంట్ చేసింది. ‘‘అనారోగ్యానికి గురయ్యాను కానీ పొట్టకూటి కోసం తప్పడం లేదు. జలుబు కూడా చేసింది. ఫీవర్ వచ్చినా, శరీరంలో ఓపిక లేకున్నా డాన్స్ రిహార్సిల్స్ చేస్తున్నా అంటూ విష్ణుప్రియ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ నటి పోస్ట్ పై నెట్టింట నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.