'సూపర్‌ మామ్స్‌ 3' గ్రాండ్‌ ఫినాలేలో ఇరగదీసిన రష్మిక.. ఫ్యాన్స్ ఫిదా

by sudharani |
సూపర్‌ మామ్స్‌ 3 గ్రాండ్‌ ఫినాలేలో ఇరగదీసిన రష్మిక.. ఫ్యాన్స్ ఫిదా
X

దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రముఖ హిందీ రియాలిటీ షో 'సూపర్‌ మామ్స్‌3' గ్రాండ్‌ ఫినాలేకు హాజరై అభిమానులను అలరించిది. అయితే ఈ ఎపిసోడ్‌‌‌కు సంబంధించిన ప్రోమోను తాజాగా మేకర్స్ విడుదల చేయగా.. ఇందులో బాలీవుడ్ నటుడు గోవిందతో కలిసి 'సామీ.. సామీ..' పాటకు స్టెప్పులేస్తూ ఇరగదీసింది. ఇక ఆమె డ్యాన్స్ చూసిన ప్రేక్షకులు, న్యాయనిర్ణేతలను పెద్దగా చప్పట్లు కొడుతూ ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారగా.. ఈ షో పూర్తి ఎపిసోడ్‌ ఆదివారం రాత్రి ప్రసారం కానుంది.

Advertisement

Next Story