కంగన సినిమాలో విక్రమ్ గెస్ట్ రోల్..?

by Hamsa |   ( Updated:2022-10-03 13:13:34.0  )
కంగన సినిమాలో విక్రమ్ గెస్ట్ రోల్..?
X

దిశ, సినిమా: విక్రమ్ హీరోగా మ‌ణిర‌త్నం ద‌ర్శక‌త్వంలో తెరకెక్కిన చిత్రం 'పొన్నియ‌న్ సెల్వన్‌ 1'. సెప్టెంబర్ 30న రిలీజ్ అయిన ఈ మూవీ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఇదిలావుంటే.. ఈ చిత్రం రిలీజై వారం గడవకముందే బాలీవుడ్‌లో ఓ పౌరాణిక సినిమాలో కీలక పాత్ర పోషిచేందుకు చియాన్ విక్రమ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. అలౌకిక్ దేశాయ్ ద‌ర్శక‌త్వంలో కంగన రనౌత్ క‌థానాయిక‌గా వస్తున్న 'సీత ది ఇంకార్నేష‌న్' అనే సినిమాను రాముడి పెళ్లికి ముందు కథతో చూపిస్తుండగా.. విక్రమ్ పోషిస్తున్న గెస్ట్ రోల్ ఈ చిత్రానికి కీలకం కాబోతుందని టాక్ వినిపిస్తోంది.

ఇవి కూడా చదవండి : 'జాతిరత్నాలు' కాంబినేషన్ రిపీట్.. థియేటర్లలో మరోసారి రచ్చే!

Advertisement

Next Story