పెళ్లిపై హింట్ ఇచ్చేసిన విజయ్ దేవరకొండ.. వధువు ఎవరంటే?

by Hamsa |
పెళ్లిపై హింట్ ఇచ్చేసిన విజయ్ దేవరకొండ.. వధువు ఎవరంటే?
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి మూవీ నుంచి రౌడీ బాయ్‌గా మారిపోయాడు. వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అలాగే సోషల్ మీడియాలోనూ పలు పోస్టులతో అభిమానులకు దగ్గరగా ఉంటున్నాడు. ఇటీవల ఈ యంగ్ హీరో ప్రభాస్ కల్కి 2898ఏడిలో కీలక పాత్రల్లో నటించి మెప్పించాడు. ప్రస్తుతం విజయ్ రెండు, సినిమాలు లైన్‌లో పెట్టాడు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో.. విజయ్ పెళ్లిపై హింట్ ఇచ్చి ఫ్యాన్స్‌ సర్‌ప్రైజ్ చేశాడు. ఇటీవల ఇండియన్ ఐడల్ సీజన్-3 షోలో పాల్గొని సందడి చేశాడు. దీనికి సంబంధించిన ప్రొమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో గీతా మాధురి విజయ్‌ను ఉద్దేశించి మీరు ఎంతమంది ఫీమేల్ సింగర్స్‌కు క్రష్షో తెలుసా? అని అంటుంది. దానికి విజయ్ ‘‘అదంతా పెళ్లయ్యేంత వరకే అనుకుంటా’’ అని సమాధానం చెబుతాడు. అప్పుడు గీతా ఎవరిది మీదా.. వాళ్లదా అని అనడంతో విజయ్ సిగ్గు పడిపోతాడు. ప్రస్తుతం రౌడీ బాయ్ కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.

ఇన్నాళ్లు పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు అడిగితే దాట వేసేవాడు. కానీ ఈ సారి సిగ్గు పడటంతో నెటిజన్లలో పలు అనుమానాలు మొదలయ్యాయి. కాగా, విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా గత కొద్ది కాలంగా ప్రేమాయణం కొనసాగిస్తున్నట్లు పలు వార్తలు సోషల్ మీడియాను షేక చేస్తుంటాయి. అంతేకాకుండా వీరిద్దరు వెకేషన్‌కు వెళ్లిన సమయంలో చేసిన పోస్టుల ద్వారా నెటిజన్లు పలు ఆధారాలను కూడా గుర్తించారు. దీంతో కచ్చితంగా వీరిద్దరు పెళ్లి చేసుకుంటారని ఫిక్స్ అయ్యారు. అలాగే రష్మికను ఆనంద్ దేవరకొండ వదిన అని పిలుస్తుండటంతో వీరిద్దరి పెళ్లి వార్తలకు బలం చేకూరినట్లు అయింది. కానీ విజయ్- రష్మిక మాత్రం ఎన్ని వార్తలు వచ్చినప్పటికీ స్పందించకుండా సైలెంట్‌గా తమ పని తాము చేసుకుంటూ సినీ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో పెళ్లిపై విజయ్ అలా కామెంట్స్ చేయడంతో వీరిద్దరే తొందరలో ఒక్కటవ్వబోతున్నారంటూ పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ అంతా ఖుషీ అవుతున్నారు. కానీ ఫ్యాన్స్ మాత్రం అందులో నిజం లేదని పెళ్లి వార్తలను కొట్టిపారేస్తున్నారు.

Next Story

Most Viewed