రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన విజయ్ దేవరకొండ-రష్మిక.. ఆ వీడియో వైరల్

by samatah |   ( Updated:2023-06-24 10:31:33.0  )
రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన విజయ్ దేవరకొండ-రష్మిక.. ఆ వీడియో వైరల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రిలేషన్‌లో ఉన్నట్లుగా ఎప్పటి నుంచో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ మేము స్నేహితులం మాత్రమే అంటూ మాట దాటేశారు ఇద్దరు. అయితే తాజాగా రష్మిక విజయ్‌తో లంచ్ డేట్‌కి వెళ్లిన వీడియో సోషల్ మీడియా‌లో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు నిజం దాస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ముందు నుంచి కూడా రష్మిక-విజయ్ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని చాలా మంది అభిమానులు ఆశపడుతున్నారు. ఏదో ఒక రోజు నిజం కావాలని ఇటు విజయ్ ఫ్యాన్స్, అటు రష్మిక ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Also Read: తమన్నకు విజయ్ అంటే అంత పిచ్చా.. అతని కోసం ఆ రూల్‌ని కూడా బ్రేక్ చేసిందా?

Advertisement

Next Story