కామారెడ్డిలో తీరనున్న కరెంట్ కష్టాలు

by Naveena |
కామారెడ్డిలో తీరనున్న కరెంట్ కష్టాలు
X

దిశ, కామారెడ్డి : జిల్లా కేంద్రమైన కామారెడ్డికి మరో 33/11 కేవీ సబ్ స్టేషన్ ను ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మంజూరు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కామారెడ్డి పట్టణంలో ఉన్న సబ్ స్టేషన్ లపై లోడ్ ఎక్కువ పడటంతో పాటు..చుట్టు పక్కల గ్రామాల్లో ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు కామారెడ్డి సబ్ స్టేషన్ నుండి కరెంటు ఇవ్వడం ద్వారా కామారెడ్డి పట్టణానికి కరెంట్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని విద్యుత్ శాఖ అధికారులు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. దీంతో తాను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు.. వరంగల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తో మాట్లాడి కామారెడ్డి పట్టణానికి నూతనంగా 33-11 కె.వి సబ్ స్టేషన్ మంజూరు చేయించినట్లు తెలిపారు. దీంతో కామారెడ్డి పట్టణానికి రాబోయే 25 సంవత్సరాల వరకు ఎలాంటి విద్యుత్ అంతరాయం లేకుండా పోతుందన్నారు. 33/11 కె.వి. విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి స్థలాన్ని కూడా విద్యుత్ శాఖ అధికారులు పరిశీలించారని చెప్పారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. రెండు మూడు నెలల లోపు సబ్ స్టేషన్ అందుబాటులోకి వస్తుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed