- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పాలనపై పేలుతున్న మాటలు.. ఎంపీకి మంత్రి సంచలన సవాల్

దిశ, వెబ్ డెస్క్: పాలనలో కూటమి ప్రభుత్వం ఆర్నెళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా వైసీపీ(Ycp), టీడీపీ(Tdp) నేతల మధ్య విమర్శల వర్షం కురుస్తోంది. ఆర్నెళ్లలో కూటమి ప్రభుత్వం ఏమీ చేయదలేదని వైసీపీ నాయకులు విమర్శలు చేస్తుంటే.. గత ఐదేళ్ల పాలనను ప్రస్తావిస్తూ టీడీపీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా రామచంద్రాపురం నియోజకవర్గంలో రాజకీయ వాతావరణ ఒక్కసారిగా వేడెక్కింది. వైసీపీ ఎంపీ పిల్లి సుభాస్ చంద్రబోస్(YCP MP Pilli Subhas Chandra Bose), మంత్రి వాసంశెట్టి సుభాష్(Minister Vasamshetty Subhash) మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. తమ 6 నెలల పాలన.. వైసీపీ ఐదేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా అంటూ సుభాస్ సవాల్ విసిరారు. వైఎస్ జగన్(Ys Jagan) హయాంలో అవినీతి జరగలేదని బోస్ చెప్పగలరా అని ప్రశ్నించారు. మాజీ మంత్రి వేణు, బోస్ వాటాలు పంచుకున్నారా అని నిలదీశారు. రామచంద్రాపురం(Ramachandrapuram)లో గత ఐదేళ్లు అంతులేని అక్రమాలు జరిగాయని మంత్రి సుభాష్ ఆరోపించారు. కౌలు రైతుల పేర్లతో క్రాప్ ఇన్స్యూరెన్స్ కూడా మింగేశారని మండిపడ్డారు. ఏరియా ఆస్పత్రులు, ద్రాక్షరామ ఆలయంలోనూ అవినీతి జరిగిందని మంత్రి సుభాష్ ఆరోపించారు.