ఫంక్షన్ కు వెళ్లాల్సిన వృద్ధురాలు పరలోకానికి

by Kalyani |
ఫంక్షన్ కు వెళ్లాల్సిన వృద్ధురాలు పరలోకానికి
X

దిశ,గుండాల : యాదాద్రి జిల్లా గుండాల మండలంలో డ్రైవర్ నిర్లక్ష్యంతో వృద్ధురాలు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. స్థానిక ఎస్ఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం… పెద్ద పడిశాల గ్రామానికి చెందిన గైగులరామక్క ఒక ఫంక్షన్ నిమిత్తం దేవరప్పులకు వెళుతుండగా, రవాణా సౌకర్యం లేకపోవడంతో అదే గ్రామానికి చెందిన ఉప్పల మల్లేష్ తన సొంత ట్రాక్టర్ తో అదే దారిలో వెళ్తుండగా వృద్ధురాలు లిఫ్ట్ అడిగి ట్రాక్టర్ ఎక్కి కూర్చుంది. కొంత దూరం ప్రయాణం తర్వాత డ్రైవర్ నిర్లక్ష్యంతో ట్రాక్టర్ ను అతి వేగంగా నడపడంతో రోడ్డుకు ఒకవైపు దూసుకెళ్లి ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో వృద్ధురాలు కిందపడి అక్కడి కక్కడే మృతి చెందింది. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మృతురాలి పార్థివ దేహాన్ని జనగామ ఏరియా హాస్పిటల్ కి తరలించినట్లు తెలిపారు.



Next Story

Most Viewed