- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మమతా బెనర్జీ చేసిన ప్రకటనపై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఫైర్

దిశ, వెబ్ డెస్క్: వక్ఫ్ సవరణ బిల్లుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి (Chief Minister of Bengal) మమతా బెనర్జీ (Mamata Banerjee) చేసిన ప్రకటనపై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ (Union Minister Gajendra Singh Shekhawat) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వక్ఫ్ సవరణ చట్టం తర్వాత బెంగాల్‌లో నెలకొన్ని హింసకు సీఎం ప్రకటనే కారణమని స్థానిక బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాగా రాష్ట్రంలో పలు జిల్లాల్లో హింసాకాండ (violence) జరుగుతున్నప్పటికీ సీఎం మమత బెనర్జీ స్పందించకపోవడంపై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరిస్థితులపై ఆయన మాట్లాడుతూ.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (CM Mamata Banerjee) ప్రభుత్వ హయాంలో ఓట్ల కోసం సృష్టించబడుతున్న పరిస్థితులు దురదృష్టకరం, ఖండించదగినవి అన్నారు.
శ్రీరామ నవమి నుండి నిరంతరం, హిందూ మెజారిటీ ప్రజలను హింసించి, తగలబెట్టడానికి ఓ వర్గం ప్రజలను వదిలి వేస్తున్నారు. వారు దేవాలయాలను ధ్వంసం చేస్తున్నారు, మహిళలను వేధిస్తున్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం మమతా బెనర్జీ ఓట్ల కోసం మౌనంగా ఉంది. ఇది బెంగాల్ విభజన కాలాన్ని గుర్తు చేస్తుంది. కానీ వారిచే సృష్టించబడిన ఈ హింసాకాండకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. అలాగే రాబోయే ఎన్నికల్లో బెంగాల్‌ను ఇలాంటి సంఘటనల నుండి లభిస్తుందని, పశ్చిమ బెంగాల్‌లో బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుందని తాను నమ్ముతున్నానని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు.
హింసను అదుపు చేయడానికి కేంద్ర సాయుధ పోలీసు బలగాల (CAPF)తో పాటు BSF యొక్క ఐదు కంపెనీలను ముర్షిదాబాద్‌లోని హింసాత్మక ప్రాంతాలలో మోహరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లా (Murshidabad District)లో హింసాత్మకంగా మారాయి.నిరసనకారులు మతపరమైన హింసకు దిగడంతో.. ఆ ప్రాంతం మొత్తం అల్లకల్లోలంగా మారింది. దీంతో స్థానికి ప్రజలు ఆ ప్రాంతాన్ని వదిలేసి అక్కడినుంచి వెళ్లిపోతున్నారు. శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) యొక్క ఐదు కంపెనీలను రంగంలోకి దించారు.