శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఇష్టారాజ్యాంగ ప్రోటోకాల్ దర్శనాలు

by Veldandi saikiran |   ( Updated:2025-04-13 12:15:09.0  )
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఇష్టారాజ్యాంగ ప్రోటోకాల్ దర్శనాలు
X

దిశ, వెబ్ డెస్క్ : శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ( Srikalahasti Temple) ప్రోటోకాల్ దర్శనాలలో ( Protocol darshans) అవకతవకలు జరిగాయి. ఇష్టానుసారంగా.. ఎవరికి పడితే వారికి ప్రోటోకాల్ దర్శనాలు శ్రీకాళహస్తి ఆలయంలో జరుగుతున్నాయని సమాచారం అందుతోంది. ఈ సంఘటనలో ఏకంగా ముగ్గురు ఆలయ సిబ్బందికి మెమోలు కూడా ఇచ్చారు దేవాలయ ఈవో బాపిరెడ్డి ( EO Bapireddy). తెల్ల కాగితం పైన ఆలయ ఉద్యోగి ఏ ఈ ఓ విద్యాసాగర్ రెడ్డి ( AEO Vidyasagar Reddy) ప్రోటోకాల్ సిఫార్సులు పంపాడు.

గత ఎనిమిది నెలలుగా అడ్డగోలుగా ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి దర్శనాలు చేయించినట్లు సమాచారం అందుతుంది. అయితే విద్యాసాగర్ రెడ్డి పైన అనుమానం వచ్చి.. లోలోపల దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు ఈవో బాపిరెడ్డి. ఈ తరుణంలోనే... అక్రమంగా ప్రోటోకాల్ దర్శనాలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా ఏఈఓ విద్యాసాగర్ రెడ్డిని ఈవో బాపిరెడ్డి పట్టుకున్నారు.

అనంతరం ముగ్గురు ఉద్యోగులకు మెమోలు కూడా జారీ చేశారు. విద్యాసాగర్ రెడ్డి, దుర్గాప్రసాద్ అలాగే విశ్వనాధ శర్మ లకు మెమోలు జారీ చేశారు శ్రీకాళహస్తి ఆలయ ఈవో బాపిరెడ్డి. ఇలాంటి అక్రమాలకు ఎంతటి అధికారి పాల్పడిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు బాపిరెడ్డి. ఇకపై ఇలాంటి సంఘటనలు కూడా జరగకుండా చూసుకుంటామని తెలిపారు.

Next Story

Most Viewed