- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తీవ్ర విషాదం.. ఇంటర్‌లో ఫెయిల్.. ఫినాయిల్ తాగిన విద్యార్థిని!?

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లో శనివారం ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సరం పరీక్షల ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఈ పరీక్ష ఫలితాల్లో పలువురు విద్యార్థులు ఉత్తీర్ణత సాధించకపోవడంతో తీవ్ర నిర్ణయాలు తీసుకున్న ఘటనలు చోటుచేసుకున్నాయి. పరీక్షల్లో ఫెయిలయ్యామనే మనస్తాపంతో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటనలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. విశాఖలోని కొండపేటకు చెందిన చరణ్ తేజ అనే విద్యార్థికి ఇంటర్ ద్వితియ సంవత్సరం ఫిజిక్స్‌లో కేవలం 10 మార్కులే రావడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
ఈ క్రమంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అలాగే.. నంద్యాల జిల్లా బండిఆత్మకూరు మండలంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో ఫెయిలైన చిన్న మస్తాన్, నెల్లూరు జిల్లా చింతారెడ్డిపాలెం ప్రాంతంలో మరో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. రాష్ట్రంలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందడం కలకలం రేపుతోంది. ఇక కర్నూలు జిల్లా ఆదోనిలో రెండు సబ్జెక్టులు ఫెయిలైన ఓ విద్యార్థిని ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే.. ఈ ఘటనను గమనించిన పేరెంట్స్ ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటుంది.