జారిపడ్డ పొంగులేటి సుధాకర్ రెడ్డి...

by Kalyani |
జారిపడ్డ పొంగులేటి సుధాకర్ రెడ్డి...
X

దిశ, ఖమ్మం : అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని గవ్ చలో... బస్తీ చలో కార్యక్రమంలో ఆదివారం ఖమ్మం నగరంలోని అంబేద్కర్ విగ్రహాన్ని శుద్ధి చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు సహాయ ఇంచార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని నీళ్లతో శుద్ధి చేసి చీపురుతో పరిసరాలను శుభ్రం చేసే తరుణంలో ఒక్కసారిగా కాలుజారి కింద పడిపోయారు. వెంటనే బిజెపి కార్యకర్తలు అతన్ని పైకి లేపారు‌. ఈ ప్రమాదంలో పొంగులేటి సుధాకర్ రెడ్డికి ఎలాంటి గాయాలు కాకపోవటంతో బిజెపి కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.

Next Story

Most Viewed