- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లా అండ్ ఆర్డర్ కోసం నిరంతరం శ్రమిస్తున్నాం : సీపీ సునీల్ దత్
దిశ బ్యూరో, ఖమ్మం: ప్రజల రక్షణే తమ బాధ్యత అని, లా అండ్ ఆర్డర్ గాడిలో ఉండేందుకు నిరంతరం శ్రమిస్తున్నామని ఖమ్మం సీపీ సునీల్ దత్ అన్నారు. శనివారం కమిషనరేట్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వార్షిక సమీక్ష వివరాలు వెల్లడించారు. పిటీషన్లు, ఎఫ్ఐఆర్ ల నమోదు విషయంలో ఏ మాత్రం అశ్రద్ధ చేయలేదని, ప్రతి కేసును చాలెంజ్ గా తీసుకుని విచారణ చేపట్టామన్నారు. వరదల సమయంలో తన సిబ్బంది చాలా మెరుగైన పనితీరును ప్రదర్శించారని, అందరూ విధి నిర్వహణలో నిమగ్నమై ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతరం సేవలందించారని కొనియాడారు. జిల్లాలో క్రైం శాతం తగ్గించేందుకు అనేక చర్యలు చేపట్టామని వెల్లడించారు. ట్రాఫిక్ నియంత్రణకు, సైబర్ నేరాలు అడ్డుకట్ట, మత్తు పదార్థాల సరఫరా, స్త్రీల రక్షణ, దొంగతనాల విషయంలో కఠినంగా వ్యవహరించామని చెప్పారు.
8873 ఎఫ్ఐఆర్ ల నమోదు..
2024 సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా 8873 ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయని గతేడాదితో పోల్చుకుంటే 16 శాతం పెరిగాయని, అందులో 99.44 డిస్పోస్డ్ అయ్యాయని తెలిపారు. ప్రాపర్టీకి సంబంధించిన కేసుల్లో 295 కేసులను చేధించామన్నారు. మహిళలకు సంబంధించి 858 కేసులు నమోదు అయ్యాయని వీటి నివారణకు అనేక చర్యలు చేపట్టామన్నారు. నియోజకవర్గాల్లో పోలీస్ స్టేషన్ వారీగా అవేర్ నెస్ కార్యక్రమాలు చేపట్టామని, షీటీమ్స్ ఆధ్వర్యంలో కమిషనరేట్ పరిధిలో మహిళలపై నేరాలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు. 785 రోడ్డు ప్రమాదాలు జరిగాయని, వాటి నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పేకాట, కోడి పందేలు, మట్కా, క్రికెట్ బెట్టింగ్, లిక్కర్ దందా, గుట్కా, ఇసుక, సివిల్ సప్లయిస్ రైస్ తదితర వాటి విషయంలో కేసులు నమోదైనా అడ్డుకట్ట వేసేందుకు ప్రణాళికబద్ధంగా ముందుకు సాగామన్నారు.
డయల్ 100 కు 48008 కాల్స్ వచ్చాయన్నారు. ఈ ఏడు 5 గురిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేశామని, అందులో ముగ్గురు గంజాయి నిందితులున్నట్లు పేర్కొన్నారు. సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని, వాటి విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పిన సీపీ.. 2024లో2148 ఫిర్యాలు అందినట్లు, 5,21,33,10 రూపాయలు రికవరీ చేశామన్నారు. జిల్లాలో దాదాపు సైబర్ నేరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని చెబుతూ 445 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాలో వచ్చే లింకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
అదుపులో లా అండ్ ఆర్డర్..
ఖమ్మం జిల్లాలో లా అండ్ ఆర్డర్ అదుపులో ఉందని, ఎలాంటి ఘటనలు జరుగకుండా పోలీసులు సమిష్టిగా పనిచేస్తున్నారని తెలిపారు. నేరాలు కూడా తగ్గుముఖం పట్టాయని, పోలీస్ సిబ్బంది బాధ్యతతో వ్యవహరిస్తున్నారని, ప్రజలు కూడా నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని సీపీ సూచించారు. ప్రతి సమస్య పరిష్కారం కోసం ప్రజలు పోలీస్ స్టేషన్ కు వస్తున్నారని, కేసులోని మెరిట్ ప్రకారం ఎఫ్ఐఆర్ లు నమోదు చేసి బాధితులకు న్యాయం చేస్తున్నామని పేర్కొన్నారు.