Decision fatigue : నిర్ణయం తీసుకోవడంలో కన్‌ఫ్యూజన్.. దేనికి సంకేతమంటే..

by Javid Pasha |   ( Updated:2024-12-28 14:15:52.0  )
Decision fatigue : నిర్ణయం తీసుకోవడంలో కన్‌ఫ్యూజన్.. దేనికి సంకేతమంటే..
X

దిశ, ఫీచర్స్ : మీరు ఏదైనా ఫంక్షన్‌కు వెళ్తారు.. అక్కడ రకరకాల రుచికరమైన వంటకాలు ఉంటాయి. చూడగానే ఫుల్లుగా తినేద్దామనుకుంటారు. కానీ వడ్డించుకునే సమయంలో మాత్రం ఏది సెలెక్ట్ చేసుకోవాలో కన్‌ఫ్యూజ్ అవుతారు. అలాగే షాపింగ్‌కు వెళ్లినప్పుడు కూడా రకరకాల వస్తువులు, డ్రెస్సులు నచ్చుతాయి. అక్కడా అంతే.. ఒకటికంటే ఎక్కువగా నచ్చినపప్పుడు దేన్ని ఎంపిక చేసుకోవాలనే దగ్గర మాత్రం తడబడతారు. ఇలాంటి కన్‌ఫ్యూజన్, తడబాటు ఎప్పుడో ఒకసారి అయితే కామన్. కానీ ప్రతీ విషయంలో అదే కంటిన్యూ అయితే మాత్రం అలర్ట్ అవ్వాల్సిందే. ఎందుకంటే అది డెసిషన్‌ ఫెటీగ్ (Decision fatigue) అనే మానసిక ధోరణికి కారణం కావచ్చు అంటున్నారు నిపుణులు.

* వస్తువులు, దుస్తులు, ఆహార పదార్థాలు.. ఇలా ఏవైనా కానివ్వండి. మనకు ఎక్కువగా అందుబాటులో ఉన్నప్పుడు, ఒకే రకమైన ఆప్షన్‌లు ఉన్నప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలనే దగ్గర కన్‌ఫ్యూజ్ అవుతుంటారు పలువురు. చివరికి ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఏం తినాలి? ఏం వండాలి? ఏ మూవీ చూడానే దగ్గర డెసిషన్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. అయితే ఈ డెసిషన్ ఫెటీగ్ అనేది ప్రమాదకరమైన సమస్య కాదు కానీ.. ఓ విధంగా మనల్ని తడబాటుకు గురిచేస్తుంది. దీనివల్ల కోపం, చికాకు, అలసట వంటివి కూడా వస్తుంటాయి. తరచూ ఈ సమస్యను ఎదుర్కొంటుంటే గనుక బయటపడే ప్రయత్నం చేయాలంటున్నారు నిపుణులు. అదెలాగో చూద్దాం.

*ఒక నిర్ణయం తీసుకోవడంలో తడబాటుకు అధిక ఒత్తిడి, అవగాహనా రాహిత్యం వంటివి కూడా కారణం కావచ్చు. ఎందుకంటే మెదడు పనితీరులో గ్లుటామేట్ కీ రోల్ పోషిస్తుంది. ఇది నాడీ కణాల నుంచి మెదడుకు సిగ్నల్స్ అందిస్తుంది. ఒక విషయంలో మరీ ఎక్కువగా ఆలోచించినప్పుడు ఇది స్థాయికి మించి ప్రొడ్యూస్ అవడంవల్ల అతి అలసటకు దారితీస్తుంది. సరైన నిర్ణయం తీసుకోవడంలో ఇది ఆటంకంగా మారుతుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి రిలాక్స్‌గా ఉండే ప్రయత్నం చేయండి.

* ఎక్కువ ఆప్షన్‌లు ఉన్నప్పుడు ఏం తినాలో, షాపింగ్ విషయంలో అయితే ఏం కొనాలో తడబడే పరిస్థితి నుంచి బయటప పడాలంటే కొంత కాలం దానిని నివారించే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా మీరు ఏం కొనాలనుకుంటున్నారో ముందే నిర్ణయించుకోండి. మెనూను తగ్గించుకోండి.

* నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యమే. కానీ అన్నీ మీరే తీసుకోకండి. మీ ఇంటికి సంబంధించినవైతే మీ భాగస్వామికో, ఇతర కుటుంబ సభ్యులకో కొన్నింటిని అప్పగించండి. అట్లనే వర్క్ ప్లేస్‌లో అయితే కొన్ని విషయాల్లో నిర్ణయాలను టీమ్ సభ్యులకు వదిలేయవచ్చు. రెగ్యులర్ వ్యాయామాలు, ఫిజికల్ యాక్టివిటీస్ కూడా రక్త ప్రసరణను మెరుగు పరిచి బాడీలో గ్లూకోజ్‌ నియంత్రణ ప్రక్రియను పెంచుతాయి. దీంతో బ్రెయిన్‌కు తగిన స్థాయిలో గ్లూకోజ్ అంది అలసట దూరం అవుతుంది.

*తీసుకున్న ప్రతీ నిర్ణయం సరైనదే అయి ఉండాల్సిన అవసరం లేదు. పొరపాటు నిర్ణయాలు కూడా మానవ సహజం. కాబట్టి ఎప్పుడైనా మీ డెసిషన్ కరెక్ట్ కాదని తెలిస్తే చింతంచకండి. దీనివల్ల కూడా మరోసారి నిర్ణయాలు తీసుకోవడంలో కన్ ఫ్యూజన్ ఏర్పడుతుంది. అలాగే అలసటలో ఉన్నప్పుడు, కోపంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, భావోద్వేగాలకు లోనైనప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు కూడా తడబాటుకు కారణం కావచ్చు లేదా సరైనవి కాకపోవచ్చు. అందుకే ప్రశాంతంగా ఉన్నప్పుడు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటుంటారు నిపుణులు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed