డిసెంబర్ తర్వాత పత్తి పంటను పొడిగించవద్దు.. : జిల్లా కలెక్టర్ రాజర్షి షా

by Aamani |
డిసెంబర్ తర్వాత పత్తి పంటను పొడిగించవద్దు.. : జిల్లా కలెక్టర్ రాజర్షి షా
X

దిశ, ఆదిలాబాద్ : డిసెంబర్ నెల అనంతరం పత్తి పంటకు గులాబీ రంగు పురుగు నష్టాన్ని కలిగించే అవకాశం ఉన్నందున జిల్లా వ్యాప్తంగా రైతులు డిసెంబర్ నెల తర్వాత పత్తి పంటను పొడిగించకుండా నీటి వసతి ఉన్న వారు వేరే పంటలను సాగు చేయాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజార్షి షా అన్నారు.

జైనాథ్ మండలం లోని లక్ష్మీపురం గ్రామంలో పత్తి పంటను జిల్లా కలెక్టర్ వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులతో శనివారం పరిశీలించారు. శాస్త్రవేత్తల ద్వారా పత్తి పంటలలో వచ్చే మార్పులు వాటికి నష్టాన్ని కలిగించే పలు అంశాలను వ్యవసాయ శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో పత్తి పంటను డిసెంబర్ నెల తరువాత గులాబి రంగు పురుగు ఆశించి రైతులను నష్టాన్ని కలిగించే అవకాశం ఉన్నందున, రైతులు ఎవరు కూడా పత్తి పంటను పొడిగించకుండా వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారుల సూచనలు తీసుకుని నీటి వసతి ఉన్న రైతులు వేరే అనుకూల పంటలు వేసుకోవాలనీ సూచించారు. ఇందులో వ్యవసాయ శాస్త్రవేత్త డా.రాజశేఖర్,కృషి విజ్ఞాన కేంద్రం సాంకేతిక వ్యవసాయాధికారి వెండి విశ్వామిత్ర, మండల వ్యవసాయాధికారులు జైనథ్, బేల, కుమారి పూజ, సాయి తేజ్ రెడ్డి, ఏ ఈ ఓ రైతులు,తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed