Malaria-Dengue: ఈ ఆకు మలేరియా, డెంగ్యూకు బెస్ట్ మెడిసిన్.. వీటితో పాటుగా..!

by Anjali |   ( Updated:2024-12-28 16:19:15.0  )
Malaria-Dengue: ఈ ఆకు మలేరియా, డెంగ్యూకు బెస్ట్ మెడిసిన్.. వీటితో పాటుగా..!
X

దిశ, వెబ్‌డెస్క్: డెంగ్యూ జ్వరం(Dengue fever) అనేది డెంగ్యూ వైరల్ దోమల ద్వారా సంక్రమించే వ్యాధి. ఈ వ్యాధి తలెత్తితే.. ఆకస్మిక అధిక జ్వరం (105 డిగ్రీలు), కళ్ళు వెనుక నొప్పి, తీవ్రమైన కండరాల నొప్పి(muscle pain) వస్తుంది. వీటితో పాటుగా ఏ పని చేసిన వెంటనే అలసిపోతారు. వికారం(Nausea), వాంతులు (vomiting) అవుతాయి. డెంగ్యూతో పాటు మలేరియా(Malaria) కూడా జనాల్ని ఇబ్బంది పెట్టేదానిలో ఒకటి. ఉష్ణమండల ప్రాంతాల్లో దోమల ద్వారా ఈ ప్రాణాంతక వ్యాధి వ్యాపిస్తుంది. ఇది మలేరియా ప్లాస్మోడియం(Plasmodium) అనే పరాన్నజీవి ద్వారా సోకుతుంది.

ఈ అనాఫిలిస్(Anopheles) దోమ కాటు ద్వారా మానవులకు వస్తుంది. దీంతో తీవ్రమైన జ్వరం వస్తుంది. డెంగ్యూ హెమరేజిక్ జ్వరం(Hemorrhagic fever), రక్త కణాలకు నష్టం వటిల్లుతుంది. ముక్కు, చిగుళ్ల నుంచి రక్తం వస్తుంది బ్లడ్ సర్కులేషన్‌లో ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ సమస్య రాగానే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి. లేకపోతే కొన్నిసార్లు ప్రాణహాని జరిగే అవకాశాలున్నాయని నిపుణులు సూచిస్తున్నారు.

అయితే ఈ డెంగ్యూ, మలేరియా ఫీవర్ తిప్పతీగ(thippathiga leaf) ఆకు బాగా పనిచేస్తుందని తాజాగా నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటుగా ఈ ఆకు జీర్ణక్రియను మెరుగుపర్చడంలో మేలు చేస్తుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది ఆర్థరైటిస్(Arthritis) నుంచి ఉపశమనం కలిగిస్తుంది. తిప్పతీగ తీసుకోవడం వల్ల బాడీలో పేరుకుపోయిన టాక్సిన్స్ కూడా తొలగిపోతాయి. రోగనిరోధక శక్తి(Immunity) పెరుగుతుంది. అలాగే గ్యాస్(Gas), అసిడిటీ(acidity), మలబద్ధకం(constipation) వంటి సమస్యలు దూరం చేస్తుంది. మార్నింగ్ ఖాళీ కడుపుతో ఈ తిప్పతీగ ఆకు రసం తాగితే అనేక సమస్యలకు చెక్ పెట్టొచ్చు అంటున్నారు నిపుణులు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Read More...

Blood tests: దీర్ఘాయుష్షు పెంచుకోవాలా.. ఈ పరీక్షలు తప్పనిసరి..!!


Advertisement

Next Story

Most Viewed