- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాకు ఈ టీచర్లు వద్దు సారు…కేజీబీవీ విద్యార్థుల నిరసన
దిశ, పాపన్నపేట : కేజీబీవీ పాఠశాల ఉపాధ్యాయులు గత కొంతకాలంగా సమ్మె చేయడంతో ప్రత్యామ్నాయంగా పాపన్నపేట ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులను కేజీబీవీ పాఠశాలకు బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పాపన్నపేట ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు శనివారం కస్తూర్బా పాఠశాలకు వెళ్లడంతో విద్యార్థినులతో పాటు పాఠశాల సిబ్బంది తమకు తమ పాత ఉపాధ్యాయులే కావాలి, ఇతర పాఠశాల ఉపాధ్యాయులు మాకు వద్దు అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేస్తూ వచ్చిన ఉపాధ్యాయులను తిరిగి వెనక్కి పంపించారు.
ఉపాధ్యాయులను వెనక్కి పంపితే నష్టపోతారు - డీఈవో రాధా కిషన్
ఉపాధ్యాయులను వెనక్కి పంపిన విషయం తెలుసుకున్న జిల్లా విద్యాధికారి రాధా కిషన్ మండల విద్యాధికారి ప్రతాప్ రెడ్డితో కలిసి పాపన్నపేట కేజీబీవీ పాఠశాలను శనివారం మధ్యాహ్నం చేరుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఒక దగ్గర కూర్చో బెట్టి కౌన్సిలింగ్ ఇచ్చారు. కేజీబీవీ ఉపాధ్యాయులు సమ్మె చేస్తున్నందున ప్రత్యామ్నాయంగా పాపన్నపేట ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులను పంపించామని, వారిని వెనక్కి పంపడం సమంజసం కాదని విద్యార్థులకు సూచించారు. మీకు కావలసింది విద్య, మీరు నష్టపోవద్దు అన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇతర పాఠశాల ఉపాధ్యాయులను పంపించారని, అలాంటిది ఉపాధ్యాయులను మీరు వెనక్కి పంపితే నష్టపోతారని సూచించారు. ఉపాధ్యాయులు వారి సమస్యల కోసం వారు పోరాడుకుంటారు. మీరు అందులో జోక్యం చేసుకొని మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు అంటూ డిఇఓ విద్యార్థులకు నచ్చ చెప్పారు . అలాగే విద్యార్థులకు కేజీబీవీ స్టాప్ మద్దతు తెలపడం పట్ల డీఈవో అసహనం వ్యక్తం చేశారు.