ఆ విషయంలో రౌడీ హీరోను మార్చేసిన Samantha.. Vijay Devarakonda ఆసక్తికర వ్యాఖ్యలు

by Hamsa |   ( Updated:2023-09-01 14:51:09.0  )
ఆ విషయంలో రౌడీ హీరోను మార్చేసిన Samantha.. Vijay Devarakonda ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన యాటిట్యూడ్, మాట్లాడే విధానం కాస్త బోల్డ్‌గా మాట్లాడుతూ ఒక్కోసారి ట్రోల్స్‌కు గురవుతుంటాడు. తనకు అనిపించింది వెంటనే చెప్పేస్తాడు. ఎంతమందిలో ఉన్నా కూడా అనేస్తుంటాడు. అయితే ఈ విషయంలో విజయ్‌ దేవరకొండని సమంత మార్చేసిందట.

తాజాగా విజయ్‌ ఈ విషయాన్నిస్వయంగా తెలుపుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఖుషి సినిమా షూటింగ్‌ సమయంలో ఏదైనా సీన్‌గానీ నచ్చకపోతే వెంటనే నచ్చలేదని దర్శకుడు శివ నిర్వాణకు చెప్పేవాడిని. అది వినడానికి చాలా కరుకుగా ఉందని, శివ ఫీల్‌ అయ్యే వాడట. ఇది చూసిన సమంత.. నాకు చెప్పింది. ఏం చెప్పాలన్నా ఓ పద్ధతి ఉంటుంది, అలా ఫేస్‌ మీదే చెప్పకూడదు అని సజెస్ట్ చేసింది. సాఫ్ట్ గా, కూల్‌గా మనకు నచ్చలేదనే విషయాన్ని కన్వే చేయాలని చెప్పింది. సమంత తెలివైన అమ్మాయి. శివ, నేను మూవీ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఆమె మంచి మంచి ఐడియాస్ చెప్పేది. మా ఇద్దరిలో చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. మేమిద్దరం మిడిల్ క్లాస్ నుంచి వచ్చాం కాబట్టి డబ్బు, లైఫ్ గురించి ఒకే ఆలోచనలు ఉంటాయి. అలాగే మా ఇద్దరికీ హిస్టరీ అంటే ఇష్టం. సమంత దేవుడిని ఆరాధిస్తుంది. నేను మతపరమైనవి, దేవుడి గురించి డౌట్స్ అడుగుతుంటాను. సమంతతో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉంది’’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి : Kushi OTT: ‘ఖుషి’ ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పటినుంచో తెలుసా?

Advertisement

Next Story