- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరోసారి బిగ్ బాంబ్ పేల్చిన వేణు స్వామి.. ప్రభాస్, శ్యామల దేవికి సంబంధమే లేదంటూ సెన్సేషనల్ కామెంట్స్!
దిశ, సినిమా: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి అందరికీ సుపరిచితమే. ఆయన నిత్యం పలువురు సినీ సెలబ్రిటీలపై కామెంట్స్ చేస్తూ ఉంటారు. అయితే ఒకానొక సమయంలో సమంత, నాగచైతన్య పెళ్లికి ముందే విడాకులు తీసుకుని విడిపోతారని చెప్పి పెద్ద సంచలనం సృష్టించాడు. అప్పటి నుంచి వేణు స్వామి చెప్పే జాతకాలు నిజమవుతాయని అందరూ నమ్మడం మొదలెట్టారు. అంతేకాకుండా కొంతమంది స్టార్ హీరోయిన్స్ ఏకంగా ఆయనతో పరిహార పూజలు కూడా చేయించుకున్నారు. అయితే ఇటీవల వేణు స్వామి తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్‌లో మరోసారి కేసీఆర్ గెలుస్తారని చెప్పారు. కానీ ఊహించని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రేవంత్ రెడ్డి సీఎం అయిన సంగతి తెలిసిందే. దీంతో వేణు స్వామిపై భారీగా ట్రోల్స్ వచ్చాయి.
అయినప్పటి ఏ మాత్రం తగ్గకుండా.. ప్రభాస్ సలార్ ఫ్లాప్ అవుతుందని మరోసారి కామెంట్స్ చేశారు. కానీ ఇది కూడా హిట్ అందుకోవడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఓ ఆట ఆడుకున్నారు. అప్పటి నుంచి వేణు స్వామి జాతకాలు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదు. అయినా సరే ఆయన పలువురు సినీ సెలబ్రిటీలు జాతకాలు చెబుతూ వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా, వేణు స్వామి ఉగాది సందర్భంగా మరోసారి ప్రభాస్ జాతకం చూశానని బిగ్ బాంబ్ పేల్చాడు. ‘‘ప్రభాస్‌కు ఆయన పెద్దమ్మ శ్యామలా దేవికి సంబంధం లేదు. చాలా మంది బంధువులే అంటారు కానీ నాకు తెలుసు అసలు నిజాలు. చాలా మంది ఆయన పెద్దమ్మకు బంధువులా కాదా? అని తెలియకుండా ఉంటుందా? అంటారు.
కానీ నా వరకు నేను శ్యామల దేవి కంటే ప్రభాస్ తల్లికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. అయినప్పటికీ ఇప్పుడు నేను వాళ్ల వ్యక్తిగత విషయాలు చెప్పదలుచుకోవడం లేదు. ఒకానొక సమయంలో ప్రభాస్ జాతకం వేరే వాళ్ల ద్వారా నా దగ్గరకు వచ్చింది. నేను అది చూసి చెప్పాను. అయితే అది ఎవరి ద్వారా వచ్చిందో నేను చెప్పను. ఒకసారి శ్యామలా దేవి కూడా నా దగ్గరకు వచ్చారు. కానీ ప్రభాస్ జాతకం కోసం కాదు ఆమె కృష్ణం రాజు గురించి అడగడానికి. ఆయన బతికి ఉన్నప్పుడు గవర్నర్ అవుతారా? లేదా అని తెలుసుకోవడానికి వచ్చారు. అయితే అప్పుడు నేను ఆమెకు తెలియదు అన్నట్టుగా మాట్లాడింది. అది కరెక్ట్ కాదు కదా నాకు మంచిగా అనిపించలేదు’’ అంటూ చెప్పుకొచ్చాడు.