- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమెరికాలో Veerayya vs Veerasimha
దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పూర్తి చేసుకున్న ఈ సినిమాలు ప్రమోషన్లలలో బిజీగా ఉన్నారు. అయితే.. నూతన సంవత్సరం సందర్భంగా అమెరికాలోని డల్హాస్ నగరంలో తెలుగు ప్రజలు 'తగ్గేదే లే' అనే ఈవెంట్ నిర్వహించారు. దీనిలో చాలామంది ప్రముఖులు హాజరయినట్లు సమాచారం. అయితే, ఈ వేడుకలో అభిమానులు కొందరు చిరంజీవి పాట పెట్టాలని, మరికొందరు బాలకృష్ణ పాట పెట్టాలని గొడవ పడ్డారు. అదికాస్త గొడవకు దారి తీసి చిరు ఫ్యాన్స్, బాలయ్య ఫ్యాన్స్ ఒకరిపై ఒకరు పిడి గుద్దులు గుద్దుకున్నారు. అనంతరం బాలయ్య ఫ్యాన్స్ పవన్, చిరు ఫొటోలు తగులబెట్టారు. ఆ తర్వాత బాలయ్య పోస్టర్లను మెగా ఫ్యాన్స్ చించేశారు. ఈ క్రమంలో ఈవెంట్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిర్వహకులు కలుగజేసుకొని గొడవను సర్ధుమణించారు.