'వీర సింహారెడ్డి' సినిమా చేయడం నా అదృష్టం: Gopichand Malineni

by Hajipasha |   ( Updated:2023-01-23 14:36:28.0  )
వీర సింహారెడ్డి సినిమా చేయడం నా అదృష్టం: Gopichand Malineni
X

దిశ, సినిమా: బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కలయికలో వచ్చిన చిత్రం 'వీర సింహారెడ్డి'. జనవరి 12న విడుదలై రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ సాధించిన సందర్భంగా చిత్ర బృందం విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌కు మొమెంటో అందించిన బాలకృష్ణ మాట్లాడుతూ.. 'ఈ చిత్రాన్ని ఘన విజయం చేసి, ఇలాంటి మరిన్ని మంచి సినిమాలు ఇవ్వమని ప్రోత్సహిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ శిరస్సువంచి కృతజ్ఞతలు తెలుపుతున్నా' అన్నాడు. మా సినిమాకి ఇంత పెద్ద విజయాన్ని అందించిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపిన గోపీచంద్.. ఈ అవకాశం ఇచ్చిన బాలకృష్ణకు రుణపడి ఉంటానన్నాడు. ఇంత గొప్ప సినిమాని చేసే అవకాశం ఇచ్చిన బాలయ్య, గోపీచంద్ మలినేనికి నిర్మాత నవీన్ యెర్నేని బిగ్ థాంక్స్ చెప్పాడు. చివరగా థమన్, విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ, హనీ రోజ్, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్, హను రాఘవపూడి, శివ నిర్వాణ మాట్లాడుతూ.. ఫ్యాన్స్ బాలయ్యని ఎలా చూడాలనుకుంటారో గోపి దాని కంటే ఎన్నో రెట్లు గొప్పగా చూపించాడని, 'జై బాలయ్య' ఇప్పుడు పెద్ద కల్ట్ అంటూ పొగిడేశారు.

Advertisement

Next Story