కన్నడలో సంచలనం సృష్టించిన 'వేద'.. తెలుగులో విడుదలకు సన్నాహాలు

by sudharani |   ( Updated:2023-01-30 12:10:33.0  )
కన్నడలో సంచలనం సృష్టించిన వేద.. తెలుగులో విడుదలకు సన్నాహాలు
X

దిశ, సినిమా : కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ నటించిన 'వేద' తెలుగులో రిలీజ్‌కు సిద్ధమైంది. శివ రాజ్‌కుమార్ 125వ చిత్రంగా విడుదలైన ఈ సినిమా.. సొంత బ్యానర్ గీతా పిక్చర్స్‌లో నిర్మించిన తొలి చిత్రం కాగా కన్నడలో విడుదలై సంచలనం సృష్టించింది. ఇక త్వరలో కంచి కామాక్షి కలకత్తా క్రియేషన్స్ ద్వారా తెలుగులో రిలీజ్‌కు సన్నాహాలు చేస్తుండగా.. తాజాగా టైటిల్ అండ్ మోషన్ పోస్టర్‌ను ఆవిష్కరించింది చిత్ర బృందం.

ఈ సందర్భంగా మాట్లాడిన నిర్మాత వి.ఆర్.కృష్ణ మండపాటి.. 'ఈ సినిమాను కథ నచ్చి కొన్నాను. ఒక మంచి సినిమాకి ఎప్పుడూ తెలుగు ప్రేక్షకులు బహ్మరథం పడతారనే నమ్మకంతో విడుదల చేస్తున్నా. త్వరలో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించనున్నాం' అని చెప్పుకొచ్చాడు. దర్శకుడు ఎ. హర్ష మాట్లాడుతూ.. యాక్షన్ డ్రామా చిత్రం కన్నడలో డిసెంబర్ 23న విడుదలై సంచలనం సృష్టించిందని తెలిపారు. శివన్న, ఘనవి లక్ష్మణ్, అదితి సాగర్, శ్వేత చంగప్ప, ఉమాశ్రీ తదితరులు ఈ చిత్రంలో నటించారు.

READ MORE

నాని 'దసరా' టీజర్.. గూస్‌బంప్స్ మోమెంట్స్‌తో హైప్

Advertisement

Next Story

Most Viewed