సాయిపల్లవితో మరో సినిమా చేయను.. వరుణ్ తేజ్ షాకింగ్ కామెంట్స్!

by Jakkula Samataha |
సాయిపల్లవితో మరో సినిమా చేయను.. వరుణ్ తేజ్ షాకింగ్ కామెంట్స్!
X

దిశ,సినిమా : మెగా హీరో వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. సాయిపల్లవి, వరుణ్ కాంబినేషన్‌లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకుంది. వచ్చిండే.. మెల్ల మెల్లగా వచ్చిండే అంటూ.. పల్లెటూరి అమ్మాయిగా, అమెరికా అబ్బాయిగా.. వీరు ప్రేక్షకులను అలరించారు. అయితే ఈ జోడి అప్పుడు చాలా మందికి తెగ నచ్చేసింది. కాగా, మళ్లీ ఈ హిట్ జోడీ రిపీట్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా దీనిపై వరుణ్ తేజ్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

అయితే రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన సాయిపల్లవితో సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దీని గురించి ఆయన మాట్లాడుతూ..మళ్లీ తాము కలిసి నటించకపోవడానికి బలమైన కారణం ఉందని తెలిపారు. మేము కలిసి సినిమా చేయాలనుకున్నాం..మా సినిమా కోసం సన్నాహాలు కూడా జరిగాయి. అందుకోసం దర్శకులు కూడా మాకు కొన్ని కథలు వినిపించారు. ఇద్దరం కథలు కూడా విన్నాం. కానీ ఈసారి చేసే సినిమా ‘ఫిదా’కు మించి ఉండాలని అనుకున్నాం. లేకపోతే అసలే చేయకూడదని ఫిక్స్ అయ్యాం. అందుకే మా కాంబోలో మూవీ రావట్లేదు’ అంటూ చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story