త్వరలో పెళ్లికి సిద్ధమైన వరుణ్ సందేశ్ హీరోయిన్.. వరుడు ఎవరంటే!

by Kavitha |
త్వరలో పెళ్లికి సిద్ధమైన వరుణ్ సందేశ్ హీరోయిన్.. వరుడు ఎవరంటే!
X

దిశ, సినిమా: ‘ఎవరైనా ఎప్పుడైనా’ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ముద్దుగుమ్మ విమలా రామన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంతకుముందు బాలీవుడ్ లో అనేక సినిమాల్లో నటించి మంచి క్రేజ్ దక్కించుకుంది. ఆ తర్వాత తెలుగులో.. గాయం -2, చుక్కలాంటి అబ్బాయి చక్కనైన అమ్మాయి వంటి చిత్రాలు చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్నది. కానీ హీరోయిన్ గా మాత్రం అనుకున్నంత రేంజ్‌లో ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత రుద్రాంగి , గాండీవ దారి అర్జున వంటి చిత్రాలలో కీలకపాత్రలు పోషించింది. ఈ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయాన్ని అందించలేదు. మరోవైపు వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన గాండీవ దారి అర్జున సినిమాలో విమల రామన్ కు భర్తగా నటించిన వినయ్ రాయ్‌తో ప్రేమలో పడ్డది ఈ బ్యూటీ..


ఈ క్రమంలో చాలా కాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని చాలా రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కానీ ఈ విషయంపై వీరు ఎవరూ కూడా రియాక్ట్ అవ్వలేదు. అయితే గత నెలలో తమ లవ్ విషయాన్ని ఇండైరెక్టుగా ధ్రువీకరించింది ఈ జంట. పెళ్లయిన వాళ్లు దిగేలాగా ఫోటో షూట్ చేసి తమ సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసుకున్నారు. మరొకవైపు విమలా రామన్ కూడా నెట్టింట వరుసగా వినయ్ రాయ్ తో దిగిన ఫోటోలు ఆమె షేర్ చేస్తూ వస్తోంది. ఫోటోలే కాదు వీడియోస్ కూడా పంచుకుంటుంది. దీంతో మరికొద్ది రోజుల్లో వీరు వివాహం చేసుకోబోతున్నారని కొంతమంది అంటుంటే.. మరి కొంతమంది వీరింకా లివింగ్ రిలేషన్ లో ఉన్నారు. అందుకే పెళ్లికి సంబంధించిన నిర్ణయాలు ఇంకా తీసుకోలేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా సీనియర్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె త్వరలోనే పెళ్లికి సిద్ధమవుతూ ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది.


Advertisement

Next Story