మెగా ఇంట్లో వరుణ్-లావణ్య పెళ్లి పనులు షురూ.. చిరంజీవి ఆసక్తికర ట్వీట్

by Hamsa |   ( Updated:2023-10-07 07:48:30.0  )
మెగా ఇంట్లో వరుణ్-లావణ్య పెళ్లి పనులు షురూ.. చిరంజీవి ఆసక్తికర ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా హీరో వరుణ్ తేజ్- లావణ్య ప్రేమించుకున్నారు. ఇటీవల ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకుని అందరికీ షాకిచ్చారు. అయితే వీరిద్దరూ నవంబర్‌లో పెళ్లి చేసుకోబోతున్నారంటూ పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వరుణ్, లావణ్య పెళ్లి షాపింగ్ స్టార్ట్ చేసిన వీడియో కూడా వైరల్ అయింది. ఇటీవల నిహారిక ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పెళ్లి పనులు చేయడానికి వరుణ్ అన్నయ్య అమెరికా నుంచి రమ్మన్నాడని తెలిపింది.

తాజాగా, వరుణ్, లావణ్య పెళ్లి సందడి షురూ అయినట్లు చిరంజీవి ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. శుక్రవారం రాత్రి వరుణ్-లావణ్య ప్రీ వెడ్డింగ్ షూట్ జరిగినట్లు తెలుపుతూ పలు ఫొటోలు షేర్ చేశారు. ఫ్యామిలీ మొత్తం ఈ సెలబ్రేషన్స్‌లో పాల్గన్నట్లు తెలుస్తోంది. చిరంజీవి షేర్ చేసిన ఫొటోల్లో లావణ్య ఎల్లో చుడిధార్‌లో సంప్రదాయంగా కనిపించి అందరి దృష్టిని ఆకర్శించింది. అలాగే వరుణ్ బ్లాక్ కలర్ డ్రెస్‌లో కనిపించాడు. ఇక వీరిద్దరిని చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

Advertisement

Next Story