- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ వ్యాధితో బాధపడుతున్న యంగ్ హీరో.. బాధలో ఫ్యాన్స్
దిశ, సినిమా : యంగ్ హీరో వరుణ్ ధావన్ తన హెల్త్ కండిషన్ గురించి అప్‌డేట్ ఇచ్చాడు. పాండమిక్ టైమ్‌లో పనిలేక ఇంటికే అంకితమైన తాను.. లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తేశాక ఉత్సాహంగా 'జుగ్ జుగ్ జీయో' షూటింగ్‌లో పాల్గొన్నట్లు తెలిపాడు. అయితే అప్పుడే తనకు 'వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్' వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయిందని తెలిపాడు. మనుషుల బ్యాలెన్స్ సిస్టమ్‌ను కంట్రోల్ చేసే లోపలి చెవి భాగం సరిగ్గా పని చేయకపోవడమే ఈ డిసీజ్ కాగా.. ఇన్నర్ ఇయర్‌లో ఉండే వెస్టిబ్యులర్ సిస్టమ్ మనను బ్యాలెన్స్‌డ్‌గా ఉంచడానికి కళ్లు, కండరాలతో పని చేస్తుంది.
కాగా ఈ పరిస్థితి నుంచి బయటపడే అవకాశం లేక హార్డ్ సిచ్యుయేషన్స్ ఎదుర్కొన్న ఆయన.. తనను తాను పుష్ చేసుకున్నానని, మెంటల్‌గా చాలా ఎఫెక్ట్ అయ్యానని చెప్పుకొచ్చాడు. 'భూమిపై మనమంతా రన్నింగ్ రేసులో ఉన్నాం. ఎందుకో తెలియకపోయినా పరుగెడుతున్నాం. దీనికి తప్పకుండా గ్రేటర్ పర్పస్ ఉంటుందనే అనుకుంటున్నా. అందుకే నేను ఇక్కడికి ఎందుకొచ్చానో కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నా' అని తెలిపాడు. వరుణ్ వ్యాధి గురించి తెలపడంతో ఆయన ఫ్యాన్స్ బాధను వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి : సమంత వ్యాధికి అమలనే కారణమా.. అక్కినేని ఫ్యామిలీపై నెటిజన్స్ ఫైర్!