కొత్తగా పెళ్లి చేసుకున్న వరలక్ష్మి భర్తకు అంత పెద్ద కూతురు ఉందా? మరిన్ని షాకింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చిన పెళ్లి కొడుకు

by Sujitha Rachapalli |
కొత్తగా పెళ్లి చేసుకున్న వరలక్ష్మి భర్తకు అంత పెద్ద కూతురు ఉందా? మరిన్ని షాకింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చిన పెళ్లి కొడుకు
X

దిశ, సినిమా: బ్యూటిఫుల్ వరలక్ష్మీ శరత్ కుమార్.. నికోలై సచ్ దేవ్ ను పెళ్లి చేసుకుంది. జూలై 3న థాయ్ లాండ్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంది. ఆ తర్వాత ఇండియాకు వచ్చిన కొత్త జంట మీడియాతో మాట్లాడింది. ఈ సందర్భంగా మాట్లాడిన నిక్ ఎమోషనల్ అయ్యాడు. వరలక్ష్మి లెగసీ ఎప్పటికీ కంటిన్యూ అవుతుందని హామీ ఇచ్చాడు. ఆమె తన ఇంటి పేరు తన పేరులో చేర్చుకునే బదులు తానే ఆమె పేరును చేర్చుకుంటానని.. ఇకపై నికోలై వరలక్ష్మీ శరత్ కుమార్ సచ్ దేవ్ గా పిలిపించుకుంటానని చెప్పాడు. తనకు ఇచ్చే విలువైన బహుమతి ఇదే అన్నాడు.

తన మొదటి మ్యారేజ్ కవితతో జరిగిందని.. తనకు ఆమెకు పుట్టిన 15 ఏళ్ల కూతురు ఉందని, తను కూడా వరలక్ష్మి పేరును, లెగసీని ముందుకు తీసుకెళ్తుందని చెప్పాడు. మొత్తానికి ఈ విధంగా హస్బెండ్ గోల్స్ సెట్ చేసి ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే ఈ విషయం తెలిసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. రెండో పెళ్లి చేసుకుంటున్నాడు అనుకున్నాం కానీ ఇంత పెద్ద కూతురు ఉందనుకోలేదని అంటున్నారు. మొత్తానికి వరు తనను ఇంతలా ప్రేమించే వ్యక్తిని పెళ్లి చేసుకుని మంచి పని చేసిందని అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed