వరలక్ష్మితో పడక సుఖం కోరుకున్న టీవీ హెడ్.. ఇంటికొచ్చి మరీ భయపెట్టాడని సంచలన కామెంట్స్

by sudharani |   ( Updated:2024-04-30 15:09:43.0  )
వరలక్ష్మితో పడక సుఖం కోరుకున్న టీవీ హెడ్.. ఇంటికొచ్చి మరీ భయపెట్టాడని సంచలన కామెంట్స్
X

దిశ, సినిమా : హీరోయిన్‌గా సక్సెస్ కాలేకపోయిన వరలక్ష్మీ శరత్ కుమార్ విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వావ్ అనిపించుకుంటుంది. సౌత్ ఇండస్ట్రీలో సూపర్ డూపర్ క్రేజ్ సంపాదించుకుంది. రీసెంట్‌గా ‘హనుమాన్’లో హీరోకు అక్కగా పవర్ పుల్ క్యారెక్టర్‌లో కనిపించిన వరు.. ఇప్పుడు ‘శబరి’తో మరోసారి ప్రేక్షకులను పలకరించబోతుంది. సైకలాజికల్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్‌లో ఓ బిడ్డకు తల్లిగా కనిపించబోతుంది. మే 3న మూవీ రిలీజ్ కానుండగా ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన బ్యూటీ.. తన లైఫ్‌లో జరిగిన ఓ ఇన్సిడెంట్‌ను షేర్ చేసుకుంది.

స్టార్ హీరోగా వెలుగొందిన శరత్ కుమార్ కూతురిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తాను కూడా సమస్యలు ఎదుర్కొన్నట్లు తెలిపింది. కెరీర్ బిగినింగ్‌లో ఓ టీవీ హెడ్ ఏకంగా తన ఇంటికే వచ్చి హోటల్ రూమ్‌కు రమ్మని డిమాండ్ చేసినట్లు చెప్పింది. ఎందుకంటే పర్సనల్ పనుందని, ఏకాంతంగా మాట్లాడుకుందామని చెప్పాడని తెలిపింది. సొసైటీలో ఓ సెలబ్రిటీ కూతురుగా ఉన్న తన పరిస్థితే ఇలా ఉంటే మిగతా అమ్మాయిల బాధలు ఎంత దారుణంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చని బాధపడింది వరు.

Read More...

తన బిడ్డలను లాగేసుకుంటే తల్లికి ఎంత బాధ.. కంట తడి పెట్టిస్తున్న రేణు దేశాయ్ పోస్ట్.. అసలు ఏం జరుగుతుంది?

Advertisement

Next Story