ఆమె అస్సలు నా తల్లేకాదు.. చాలా ఇబ్బంది పెట్టింది.. తల్లి రాధికపై వరలక్ష్మి శరత్ కుమార్ షాకింగ్ కామెంట్స్

by Anjali |
ఆమె అస్సలు నా తల్లేకాదు.. చాలా ఇబ్బంది పెట్టింది.. తల్లి రాధికపై వరలక్ష్మి శరత్ కుమార్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: విలక్షణ నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేస్తుంది నటి వరలక్ష్మి శరత్ కుమార్. విక్రమ్ వేదా, విష్మయ, మానిక్యా, కసాబా వంటి సినిమాల్లో అద్భుతంగా నటించి.. తర్వాత పందెం కోడి 2, సర్కార్ వంటి సినిమాల్లో లేడీ విలన్‌గా అవకాశం దక్కించుకుంది. తనలోని మరో యాంగిల్ చూపించి మంచి పేరు సంపాదించుకుంది. తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్ మూవీ ద్వారా వరలక్ష్మీ శరత్ కుమార్ టాలీవుడ్‌ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

తర్వాత క్రాక్ మూవీలో జయమ్మ పాత్రలో మెరిసింది. తర్వాత నాంది, యశోద వంటి చిత్రాల్లో నటించి సూపర్ డూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. ఇక రీసెంట్ గా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ హనుమాన్ లో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఫిదా చేసిందనడంతో అతిశయోక్తి లేదు. దీంతో వరలక్ష్మి శరత్ కుమార్ ఏ సినిమాలో నటిస్తే ఆ మూవీస్ పక్కా హిట్ కొట్టాల్సిందేనంటూ నెట్టింట ఫ్యాన్స్ కామెంట్ల మోత మోగించారు.

అయితే తాజాగా ఈ నటి ఓ ఇంటర్వ్యూకు హాజరై పలు ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది. శరత్‌ కుమార్ - చాయా దంపతులకు ఈ నటి జన్మించింది. తర్వాత వరలక్ష్మి తండ్రి సీనియర్ హీరోయిన్ రాధికను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తాజా ఇంటర్వ్యూలో సవతి తల్లిపై ఈ నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. రాధికతో మీ బంధం ఎలా ఉంటుందని ప్రశ్నించగా..

అసలు ఆమె నా తల్లి కాదు. నా ఫ్రెండ్. సవతి తల్లి అయినప్పటికీ మేమిద్దరం చాలా క్లోజ్ గా ఉంటాం. హెల్తీగా ఉండాలంటే మంచి ఫుడ్ తీసుకోవాలని చెబుతుంది. అలాగే కెరీర్‌కు సంబంధించి ఎన్నో సూచనలు ఇస్తుంటుంది. కానీ, ఏదైనా సీక్రెట్ ఆమెకు చెబితే.. దాన్ని వెంటనే అందరికీ చెప్పేస్తుంది. అలా నన్ను చాలా సార్లు ఇబ్బంది పెట్టింది. కానీ తను కావాలని అలా చేయదు. అనుకోకుండా అలా చేప్పెస్తుందంతే. అంటూ వరలక్ష్మి శరత్ కుమార్ చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story

Most Viewed