- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పినాకిని ఎక్స్‌ప్రెస్‌లో చోరీ.. మహిళకు మత్తుమందు జ్యూస్ ఇచ్చి నగలు అపహరణ
దిశ, వెబ్ డెస్క్: సికింద్రాబాద్-గుంటూరు- విజయవాడ- ఒంగోలు రైలు మార్గంలో దొంగలు రెచ్చిపోతున్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా రైళ్లలో చోరీలకు పాల్పడుతున్నారు. రాత్రి సమయంలో రైళ్లలోకి ఎక్కి బీభత్సం సృష్టిస్తున్నారు. ప్రయాణికులను బెదిరించి నగలు, డబ్బులు దోచుకుపోతున్నారు. ఇలా పలుమార్లు రైళ్లలో దోపిడీలు జరిగాయి. ప్రయాణికులు ఫిర్యాదుల చేశారు. కానీ రికవరీలో మాత్రం రైల్వే అధికారులు ముందడుగు వేయలేకపోతున్నారు. అటు రైళ్లలో జరిగే దొంగతనాలను నియంత్రించలేకపోతున్నారు.
తాజాగా విజయవాడ నుంచి చెన్నై వెళ్తున్న పినాకిని ఎక్స్ ప్రెస్ రైలులో బాపట్ల వద్ద చోరీ జరిగింది. మహిళకు మత్తు మందు ఇచ్చి దొంగతనానికి పాల్పడ్డారు ఓ వ్యక్తి. ప్రయాణికురాలితో పరిచయం పెంచుకుని జూస్ ఇప్పించారు. ఈ జూస్ తాగిన కొద్దిసేపటికే ఆమె మత్తులో జారుకుంది. దీంతో ఆమె వద్ద ఉన్న రూ. 10 లక్షల విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఆమెకు స్పృహ వచ్చిన తర్వాతనే దొంగతనం జరిగిన విషయం తెలిసిందే. దీంతో బాధితురాలు చీరాల రైల్వే స్టేషన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.