- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IND Vs SA 1st T20 : అదరగొట్టిన సంజు శాంసన్.. నమోదైన రికార్డులు ఇవే..!
దిశ, స్పోర్ట్స్ : సౌతాఫ్రికాతో జరుగుతున్న నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా శుక్రవారం డర్బన్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో సంజు శాంసన్ పలు రికార్డులను బద్దలుకొట్టాడు. వరుసగా రెండు టీ20 మ్యాచ్‌ల్లో సెంచరీలు నమోదు చేసిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో 50 బంతుల్లో 107 పరుగులు చేసిన శాంసన్ బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో 47 బంతుల్లో 111 పరుగులు చేశాడు. టీ20 మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికాపై వేగంగా సెంచరీ చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా శాంసన్ నిలిచాడు.
రోహిత్ శర్మ రికార్డును సమం చేసిన శాంసన్
ఇదే మ్యాచ్‌లో 10 సిక్సులు బాదిన శాంసన్ గతంలో రోహిత్ శర్మ నమోదు చేసిన రికార్డును సమం చేశాడు. 2017లో శ్రీలంకతో ఇండోర్‌లో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ 10 సిక్సులు బాది 118 పరుగులు చేశాడు.
టీ20ల్లో వరుసగా రెండు సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్లు వీరే..!
గుస్తవ్ మెకియన్ (ఫ్రాన్స్)
రిలీ రోసవ్ (సౌతాఫ్రికా)
ఫిల్ సాల్ట్ (ఇంగ్లాండ్)
సంజు శాంసన్(ఇండియా)
సంజుశాంసన్ నమోదు చేసిన మరిన్ని రికార్డులివే..!
- టీ20ల్లో రెండు లేదా అంత కన్నా ఎక్కువ సెంచరీలు చేసిన రెండవ వికెట్ కీపర్‌గా సంజు శాంసన్ నిలిచాడు. అంతకుముందు సెర్బియాకు లెస్లీ ఆడ్రియన్ డన్బార్ ఈ ఫీట్ అదిగమించాడు.
- సౌతాఫ్రికాతో టీ20 ఫార్మాట్‌లో అత్యధిక స్కోరు (107) చేసిన బ్యాట్స్‌మెన్‌గా సంజు శాంసన్ నిలిచాడు. 2015లో ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ (106) పరుగులు చేశాడు.
- మెన్స్ టీ20లో సౌతాఫ్రికా జట్టుపై అత్యధిక పరుగులు చేసిన నాలుగో బ్యాట్స్‌మెన్‌గా సంజుశాంసన్ నిలిచాడు. బాబార్ ఆజమ్ (122), జాన్సన్ ఛార్లెస్ (118), క్రిస్ గేల్ (117) తర్వాత సంజుశాంసన్ (107) నిలిచాడు.
-టీ20ల్లో ఉమ్మడిగా వేగంగా 7వేలు పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ జాబితాలో రాబిన్ ఉతప్పతో కలిపి రికార్డును పంచుకున్నాడు. 269 ఇన్సింగ్స్‌లు ఆడి శాంసన్ ఈ మైలురాయి సాధించాడు.