Contract Killer : మర్డర్ ఫీజు చెల్లించలేదు.. పోలీసులకు హంతకుడి ఫిర్యాదు

by Hajipasha |
Contract Killer : మర్డర్ ఫీజు చెల్లించలేదు.. పోలీసులకు హంతకుడి ఫిర్యాదు
X

దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ సిటీ పోలీసులను(UP Police) ఆశ్చర్యపరిచే సంచలన ఫిర్యాదు ఒకటి వచ్చింది. హత్యకు పాల్పడిన ఓ వ్యక్తి (నీరజ్‌ శర్మ) పోలీసు స్టేషనుకు వచ్చి.. తనకు మర్డర్ సుపారీ ఇచ్చిన వాళ్లు డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని కంప్లయింట్ ఇచ్చాడు. 2023 జూన్‌ 7న మీరట్‌లో ఉన్న ఒక పాల దుకాణం నుంచి ఇంటికి వెళ్తున్న అంజలి అనే న్యాయవాదిని చంపిన ఇద్దరు షూటర్లలో తాను ఒకడినని నీరజ్ ఒప్పుకున్నాడు. మృతురాలి (అంజలి) భర్త, అత్తింటివారే తమకు మర్డర్ సుపారీ ఇచ్చారని అతడు వెల్లడించాడు.

‘‘మర్డర్ సుపారీ(Contract Killer) పుచ్చుకున్నందుకు నాకు రూ.20 లక్షలు ఇస్తామన్నారు. మీరట్ సిటీలోని టీపీ నగర్ ఏరియాలో ఉన్న ఐదు షాపులను ఇస్తామన్నారు. మర్డర్‌కు ముందు అడ్వాన్స్‌గా లక్ష రూపాయలు ఇచ్చారు. ఇటీవలే నేను బెయిల్‌పై జైలు నుంచి బయటికొచ్చాక.. అంజలి భర్త, అత్తమామలను కలిశాను. వాళ్లు మర్డర్ సుపారీ డబ్బులు ఇచ్చేందుకు నో చెప్పారు’’ అని నీరజ్ వివరించాడు. ‘‘అంజలి భర్త, అత్తమామల నుంచి డబ్బులు వస్తాయనే ఆశతోనే నేను హత్య చేశాను. అందుకే పోలీసుల విచారణలో వాళ్ల పేర్లు చెప్పకుండా మౌనంగా ఉండిపోయాను. జైలుకు కూడా వెళ్లాను. ఇప్పుడు వాళ్లు మోసం చేయడంతో విషయమంతా చెప్పాల్సి వచ్చింది’’ అని అతడు వెల్లడించాడు. ఈ హత్యకు సంబంధించిన పలు ఆధారాలను కూడా పోలీసులకు నీరజ్ అందించాడు. అతడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసును మళ్లీ దర్యాప్తు చేయడం ప్రారంభించారు.

Advertisement

Next Story

Most Viewed