- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Piyush Goyal: అమెరికా టారిఫ్‌ల గురించి ఆందోళన లేదు: పీయూష్ గోయల్
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తిరిగి ఎన్నికైన తర్వాత అమెరికా దిగుమతులను పెంచే అంశంపై వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, హార్లే-డేవిడ్‌సన్ బైక్‌ల వంటి పోటీ లేని వస్తువులపై సుంకాలను తగ్గించడాన్ని భారత్ పరిగణించవచ్చని చెప్పారు. 'మేము టారిఫ్‌ల గురించి ఆందోళన చెందడం లేదు. చైనాపై సుంకం పెంచితే, అది కేవలం భారత్‌కు మాత్రమే సహాయపడుతుంది. అందరిపైనా సుంకం పెంపుదల జరిగితే అందరికీ ఒకే విధానం ఉంటుంది. ప్రజాస్వామ్య ప్రపంచం భారత్‌ను విశ్వసనీయ భాగస్వామిగా చూస్తుందని తాను వ్యక్తిగతంగా విశ్వసిస్తున్నాను' అని ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో గోయల్ శుక్రవారం అన్నారు. భారత్‌తో వాణిజ్య సంబంధాల్లో సుంకం పెంపుపై ట్రంప్ విధానాలపై స్పందించిన గోయల్.. భారత్‌లో చాలా ఎక్కువ టారిఫ్‌లు ఉన్నాయని ట్రంప్ ఒకటి రెండుసార్లు చెప్పి ఉండవచ్చునని, ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారని, తనకు భారత్ అంటే ఇష్టమని స్పష్టం చేశారని గోయల్ అన్నారు. భారత్‌తో మరింత వాణిజ్యం చేయాలని కోరుకుంటున్నారు. కాబట్టి దీనిపై చింతించాల్సిన అవసరం లేదని గోయల్ పేర్కొన్నారు.