పెళ్లి చేసుకుంటే రోజు ఒక్కడి ముఖమే చూడాలి.. వరలక్ష్మి బోల్డ్ కామెంట్స్

by Hamsa |   ( Updated:2023-05-25 08:04:37.0  )
పెళ్లి చేసుకుంటే రోజు ఒక్కడి ముఖమే చూడాలి.. వరలక్ష్మి బోల్డ్ కామెంట్స్
X

దిశ, సినిమా: ఇండస్ట్రీ ఏదైనా పెళ్లిపై సినీ హీరోయిన్లు ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయంతో ఉంటారు. కొంతమంది పెళ్లిళ్లు చేసుకుని సెటిల్ అవుతుంటే.. ఇంకొంతమంది పెళ్లి అనే పదానికి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసింది వరలక్ష్మి శరత్ కుమార్. హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ, లేడి విలన్ గా సెటిల్ అయ్యింది ఈ ముద్దు గుమ్మ.

ఇక విలన్ గా ఆమె నటించిన ప్రతి సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో మరింత క్రేజ్ పెరిగిపోయింది. ఇకపోతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పెళ్లి పై తన అభిప్రాయాన్ని బయట పెట్టింది వరలక్ష్మి. ‘మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు?’ అని యాంకర్ అడగ్గా .. ‘ అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలి.. చేసుకుంటే రోజు ఒక్కడి మొహమే చూస్తూ ఉండాలి కదా. తెలియని మనిషిని చేసుకోలేను. రాజకీయాల్లోకి రావడమే నా మొదటి లక్ష్యం’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది వరలక్ష్మి.

Also Read: మలయాళ నటుడిపై లైంగిక కేసు.. షాక్ ఇచ్చిన హైకోర్టు..

Advertisement

Next Story