స్మోకీ కళ్లు, నిగనిగలాడే పెదాలు.. వాణి నడుము అందాలను వర్ణించలేమంటున్న కుర్రాళ్లు

by sudharani |   ( Updated:2023-08-02 12:10:12.0  )
స్మోకీ కళ్లు, నిగనిగలాడే పెదాలు.. వాణి నడుము అందాలను వర్ణించలేమంటున్న కుర్రాళ్లు
X

దిశ, సినిమా : బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ వాణి కపూర్ నయా లుక్స్‌తో ఆకట్టుకుంటోంది. తాజాగా ఓ ఫ్యాషన్ షో కు హాజరైన ఈ ముద్దుగుమ్మ తన ఫ్యాషన్ సెన్స్, గ్లామర్ మెరుపులతో కట్టిపడేసింది. ఈ మేరకు ‘ఇండియా కోచర్ వీక్ 2023’ నిర్వహిస్తున్న ఈవెంట్‌కు హాజరైన హాటీ.. రెడ్ కలర్ గౌన్, స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో పాటు నెక్‌లైన్‌కు డైమండ్ ఎమరాల్డ్ నెక్‌పీస్‌ ధరించగా అద్భుతంగా కనిపించింది.

ఆమె స్మోకీ కళ్లు, సిగ్గుతో ఎర్రబడిన బుగ్గలు, నిగనిగలాడే పెదవులు, ఉంగరాల జుట్టుతో ర్యాంప్‌పై నడుస్తుంటే యువరాణిలా కనిపించింది. ప్రస్తుతం కుర్రాళ్లను మంత్రముగ్ధులను చేసిన ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతుంటే.. ‘సో హాట్.. లుకింగ్ గ్లోరియస్.. నువ్వే బాలీవుడ్ క్వీన్’ అంటూ తెగ పొగిడేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. హృతిక్ రోషన్ సరసన ‘వార్‘లో నటించిన బ్యూటీ ప్రస్తుతం ‘వార్2’ కోసం ప్రిపేర్ అవుతోంది.

Advertisement

Next Story