- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బెస్ట్ ఫాదర్‌గా నిరూపించుకునేందుకు చరణ్ ఎలాంటి పనులు చేస్తున్నాడో చెప్తూ పోస్ట్ పెట్టిన ఉపాసన
దిశ, సినిమా: టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పర్సనల్‌గా, ప్రొఫెషనల్‌గా చాలా హ్యాపీగా ఉన్నాడు. ఉపాసనని ప్రేమించి పెళ్లి చేసుకున్న చరణ్.. మ్యారేజ్ అయిన 11ఏళ్లకు తండ్రిగా ప్రమోట్ అయ్యాడు. ఇక ఈ దంపతులు ఆడబిడ్డకు జన్మనివ్వడమే కాకుండా చిన్నారికి క్లిన్ కారా అని నామకరణం కూడా చేశారు. ఆరు నెలలు పూర్తి కావడంతో అన్నప్రాసన కార్యక్రమాలు కూడా ముగిశాయి. ఇకపోతే తాజాగా క్రిస్మస్ పండుగను మెగా కుటుంబ సభ్యులందరూ ఒకే చోట చేరి పెద్ద ఎత్తున జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఉపాసన సోషల్ మీడియా వేదికగా తన కూతురితో కలిసి ఉన్న ఒక ఫొటోని షేర్ చేసింది. ఇందులో తన ముద్దుల కుమార్తెను రామ్ చరణ్ ఎత్తుకుని ఆడిస్తూ కనిపించాడు. ఈ ఫొటోను చూసిన మెగా అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా తండ్రీకూతుళ్ల మధ్య ఉన్న ప్రేమను చూసి మురిసిపోతున్న ఉపాసన.. ఈ ఫొటోకు ‘బెస్ట్ డాడ్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.