ఒకే బిడ్డకు ఇద్దరు తండ్రులు.. యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రి ‘బ్యాడ్ న్యూస్’ మూవీ ట్రైలర్ వచ్చేసిందోచ్!

by Kavitha |
ఒకే బిడ్డకు ఇద్దరు తండ్రులు.. యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రి ‘బ్యాడ్ న్యూస్’ మూవీ ట్రైలర్ వచ్చేసిందోచ్!
X

దిశ, సినిమా: ‘యానిమల్’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపొయిన త్రిప్తి దిమ్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ బ్యూటీ అంతకుముందు కొన్ని సినిమాలు చేసినా ఈ సినిమాతో బాగా పేరొచ్చింది. దీంతో సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరగడమే కాక అనేక సినిమా ఆఫర్లు కూడా వచ్చాయి. అయితే త్రిప్తి దిమ్రి త్వరలో ‘బ్యాడ్ న్యూస్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

త్రిప్తి దిమ్రి, విక్కీ కౌశల్, అమ్మి విరాక్ మెయిన్ లీడ్స్‌లో ఆనంద్ తివారి దర్శకత్వంలో ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లో బ్యాడ్ న్యూస్ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా బ్యాడ్ న్యూస్ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లో.. హీరోయిన్ కి ప్రెగ్నెన్సీ వస్తే ఇద్దరు హీరోల్లో ఎవరు తండ్రో తెలియక అయోమయంలో ఉంటే పెటర్నిటీ టెస్ట్ చేస్తారు. దీంట్లో పుట్టబోయే బిడ్డకు ఇద్దరూ తండ్రులే అని వస్తుంది. దీంతో హీరోయిన్‌తో ఏ హీరో లైఫ్ లాంగ్ ఉంటారు? ఎవరు వదిలేస్తారు? ఆ బిడ్డను తండ్రిగా ఎవరు ఒప్పుకుంటారు అనే కథాంశంతో కామెడీ, ఎమోషన్‌తో తెరకెక్కించినట్టు చూపించారు. మరి ఈ కామెడీ సినిమా ప్రేక్షకులని ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి. మరి మీరు కూడా బ్యాడ్ న్యూస్ ట్రైలర్ చూసేయండి.

Advertisement

Next Story

Most Viewed