‘టిల్లు స్క్వేర్’ కలెక్షన్ల సునామీ.. తొలి రోజు ఎన్ని కోట్లో తెలుసా..?

by Kavitha |   ( Updated:2024-03-30 14:29:01.0  )
‘టిల్లు స్క్వేర్’ కలెక్షన్ల సునామీ.. తొలి రోజు ఎన్ని కోట్లో తెలుసా..?
X

దిశ, సినిమా: ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్‌తో మార్చి 29న (శుక్రవారం) ప్రేక్షకులు ముందుకు వచ్చిన క్రేజీ సినిమా ‘టిల్లు స్క్వేర్’. సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించాడు. ఇక ఈ క్రేజీ ఎంటర్టైనర్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్, ప్రీమియర్ షోస్ ద్వారా భారీ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. కానీ, వీటన్నింటికీ మించి మొదటి రోజు కలెక్షన్ల సునామీ సృష్టించాడు టిల్లు. ఇక నిర్మాత నాగవంశీ చెప్పినట్టుగానే మొదటి రోజు భారీ ఓపెనింగ్స్‌ని నమోదు చేయడం విశేషం. కాగా వరల్డ్ వైడ్‌గా టిల్లు స్క్వేర్ ఏకంగా 23.7 కోట్ల గ్రాస్‌ని రాబట్టి ఒక సెన్సేషనల్ ఓపెనింగ్‌గా నిలిచింది. ఇది సిద్ధూ కెరీర్ లోనే బిగ్గెస్ట్ గ్రాఫ్ జంప్ అని చెప్పాలి.

మొత్తానికి అయితే, తొలి రోజున మీడియం రేంజ్ హీరోల స్థాయిలో ‘టిల్లు స్క్వేర్’ కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నైజాం ఏరియాలో సిద్ధు జొన్నలగడ్డ మన టాలీవుడ్ యువ మీరోలకు గట్టి పోటీ ఇచ్చాడు. ఎందుకంటే అక్కడ ఏరియాలో తొలి రోజున నాని ‘దసరా’ మూవీ రూ. 6.78 కోట్లు, విజయ్ దేవరకొండ ‘ఖుషీ’ సినిమా రూ. 5.15 కోట్లు సాధించాయి. వీటి తర్వాత నైజాం ఏరియాలో విడుదలైన తొలి రోజున అత్యధిక కలెక్షన్స్ సాధించిన మూడో సినిమాగా ‘టిల్లు స్క్వేర్’ ఘనత సాధించింది.

Read More..

త్వరలో టిల్లు 3.. కన్ఫామ్ చేసేసిన సిద్ధు జొన్నలగడ్డ!

Advertisement

Next Story