ఘనంగా మొదలైన '#SSMB28': ఖుష్ అవుతున్న ప్రిన్స్ ఫ్యాన్స్

by Disha News Web Desk |
ఘనంగా మొదలైన #SSMB28: ఖుష్ అవుతున్న ప్రిన్స్ ఫ్యాన్స్
X

దిశ, సినిమా: పదమూడేళ్ల గ్యాప్ తర్వాత మహేష్ బాబు- త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో మరో బిగ్ ప్రాజెక్ట్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు కానీ, ప్రస్తుతానికి '#SSMB28' అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ ప్రారంభించినట్లు తెలిపారు మేకర్స్. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రం ముహూర్తపు షాట్‌ను పూజాకార్యక్రమాలతో ఘనంగా మొదలుపెట్టగా.. ఇందుకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది మూవీ యూనిట్. ఈ కార్యక్రమంలో నమ్రతా శిరోద్కర్, పూజా హెగ్డే, త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు సూర్యదేవర రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ సినిమాలో పూజా‌హెగ్డే హీరోయిన్ కాగా థమన్ సంగీతం అందించనున్నారు.

https://twitter.com/ManobalaV/status/1489091256303046658?s=20&t=uJU7km_bdV-HU4FDrTyk0A

Advertisement

Next Story