టాప్ హీరోల జాబితాలో ఏకైక టాలీవుడ్ హీరో.. అరుదైన ఘనత సాధించిన ఎన్టీఆర్

by Hamsa |
టాప్ హీరోల జాబితాలో ఏకైక టాలీవుడ్ హీరో.. అరుదైన ఘనత సాధించిన ఎన్టీఆర్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ చిత్రంలో నటిస్తున్నాడు. రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో పాటుగా బాలీవుడ్ యాక్షన్ మూవీ ‘వార్ 2’లో కూడా ఎన్టీఆర్ పవర్‌ఫుల్ రోల్ చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలతోపాటు తారక్.. ప్రశాంత్ నీల్‌తోనూ మరో ప్రాజేక్ట్ అనౌన్స్ చేశాడు. ఇదిలా ఉంటే తాజాగా తన అభిమానులు తలెత్తుకునేలా మరో అరుదైన ఘనత సాధించాడు ఎన్టీఆర్.

ఏంటంటే.. 2023 సంవత్సరానికి ఆసియాలో టాప్ 50 నటుల జాబితాలో చోటు సంపాదించుకున్నాడు ఎన్టీఆర్. ఈ విషయాన్ని ఏషియన్ వీక్లీ మ్యాగజైన్ ‘ఈస్టర్న్ ఐ 2023’ పేరుతో ప్రకటించింది. ఇందులో తారక్ 25వ స్థానం సంపాదించుకున్నాడు. కాగా ఈ జాబితాలో తెలుగు సినీ పరిశ్రమ నుంచి స్థానం సంపాదించుకున్న ఏకైగా హీరోగా తారక్ నిలువడం విశేషం. ఇది తెలిసిన తారక్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఈ ఏషియన్ టాప్ 50లో బాలీవుడ్ నుంచి షారుక్ ఖాన్ మొదటి స్థానంలో నిలువగా.. అలియా భట్, ప్రియాంక చోప్రా రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నారు. అలాగే రణ్‌బీర్ కపూర్‌కు 6వ స్థానం, ఇళయ దళపతి విజయ్‌కు 8 స్థానంలో నిలిచారు.

Advertisement

Next Story