ఆ విషయంలో నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న స్టార్ డైరెక్టర్

by samatah |   ( Updated:2023-08-07 06:07:04.0  )
ఆ విషయంలో నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న స్టార్ డైరెక్టర్
X

దిశ, సినిమా: టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్‌తో మూవీ అంటే మామూలుగా ఉండదు. అందుకే ఆయన సినిమాలు అందరి సినిమాల కాకుండా స్పెషల్‌గా ఉంటాయి. అయితే ఒక మూవీని శంకర్ ఎంత చక్కగా తీస్తాడో ఇందులోని పాటలు కూడా అంతే అద్భుతంగా ఉంటాయి. కానీ ఆయన మూవీలో ఒక్క పాటకు అయ్యే ఖర్చుతో మూడు చిన్న సినిమాలు తీయొచ్చు. అందుకే శంకర్ గుర్తుండేలా పాటల కోసమే ఎక్కువ ఖర్చు పెట్టిస్తుంటారు. కాగా ఇప్పుడు చరణ్‌తో పాటు కమల్ హాసన్ చిత్రాల విషయంలో కూడా ఇదే చేస్తున్నారు. ఇటు రామ్‌చరణ్ ‘గేమ్ ఛేంజర్’, అటు కమల్ హాసన్‌తో ‘ఇండియన్ 2’ కోసం నిర్మాతలతో కోట్లు ఖర్చు పెట్టిస్తున్నాడు శంకర్. తాజా అప్‌డేట్ ప్రకారం చరణ్ మూవీలోని 5 పాటల కోసం మొత్తం రూ. 90 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. ఒక్కో పాటకు ఏకంగా రూ.15 కోట్లు ఖర్చు పెట్టించాడట. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

Read More: Mahesh Babu అంత రొమాంటిక్‌నా.. నమ్రత నుంచి ముద్దు కోసం అంత పని చేశాడా?

Advertisement

Next Story