- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ అరెస్ట్...!
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ గురించి పరిచయం అక్కర్లేదు. అటు టీవీ షోలు, ఇటు సినిమా ఈవెంట్లు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న ఈ యాంకర్ ఇటీవలే టీవీ షోలకు గుడ్‌బై చెప్పిందని వార్తలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. అయితే తాజాగా మరో ఆసక్తికరమైన విషయమేంటంటే? సుమ అరెస్టు అయ్యింది. ఆమె చేతికి బేడీలు వేసి కారులో తీసుకెళ్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. దీంతో ఆమె ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఎందుకు అరెస్టు చేశారు? ఏం జరిగిందని, కారణం ఏంటని నెటిజన్లు పలు రకాలుగా ప్రశ్నిస్తున్నారు. అయితే ఆ ఫోటోను తాజాగా ‘‘ఉగ్రం’’ చిత్రం యూనిట్ పంచుకుంది. సుమని హీరో అల్లరి నరేష్ అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.
ఇదంతా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జరిగిందని తెలుస్తుంది. అల్లరి నరేష్ నటించిన ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది. ఇప్పటికే చిత్ర ప్రమోషన్స్ జరుగుతున్నాయి. పాటలను కూడా విడుదల చేస్తున్నారు. తాజాగా సుమని అరెస్ట్ చేసినట్టుగా ఒక సస్పెన్స్‌తో కూడిన ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేశారు అంతే. అయితే ఇదంతా ‘కస్టడీ’ సినిమా ప్రమోషన్స్‌కి అనుకున్నారట. కాగా... నాగచైతన్య చేస్తున్న సినిమా ‘కస్టడీ’కూడా త్వరలో రిలీజ్ కాబోతుంది. ఆ సినిమా ప్రమోషన్స్ కోసం ఈ ప్లాన్ చేసి.. ప్రమోషన్స్ పరంగా హైప్ క్రియేట్ చేయాలని అనుకున్నారెమోనని నెటిజన్లు పోస్ట్‌లు పెడుతున్నారు.
అసలు ‘ఉగ్రం’ మూవీ ఎవరి మైండ్లోనూ లేదు. నరేష్ సినిమా కోసం ఇంత హంగామా చేస్తారని ఎవరూ ఊహించలేదు. దీంతో చైతూ`కస్టడీ` చిత్రం కోసమే ఇలా చేసి ఉంటారని ఫ్యాన్స్, నెటిజన్లు భావిస్తున్నారు. కానీ తీరా అల్లరి నరేష్‌తో సుమ ఉన్న ఫోటోని విడుదల చేయడంతో అంతా షాకవుతున్నారు. దీంతో ఈ హీరో టీమ్ పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరులా మారింది. ఇది నాగచైతన్య సినిమాకి కలిసి రావడం విశేషం. దీంతో అల్లరి నరేష్ చిత్రం టీమ్ బకరా అయిపోయిందని కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి: కీర్తి సురేష్ ‘దసరా’ డబ్బింగ్ వీడియో వైరల్
CI Shiva Kumar on duty!
— Allari Naresh (@allarinaresh) April 12, 2023
Your favourite anchor is in my control.
The #Ugram begins.
Details at 5.04 PM. https://t.co/5aQDlhlNdN