విడాకులు తీసుకోబోతున్న టాలీవుడ్ స్టార్ నటుడు.. షాక్‌లో ఫ్యాన్స్!

by Jakkula Samataha |
విడాకులు తీసుకోబోతున్న టాలీవుడ్ స్టార్ నటుడు.. షాక్‌లో ఫ్యాన్స్!
X

దిశ, సినిమా : ప్రస్తుతం విడాకుల ట్రెండ్ కొనసాగుతోంది. నాగచైతన్య, సమంతల విడాకుల తర్వాత నుంచి చాలా మంది నటీనటులు డివోర్స్ తీసుకోవడం కామన్ అయిపోయింది. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, చివరకు బుల్లితెర నటీనటులు కూడా విడాకులు తీసుకుంటూ తమ అభిమానులకు షాకిస్తున్నారు. కాగా, తాజాగా వీరి బాటలోనే మరో టాలీవుడ్ స్టార్ నటుడు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ అతను ఎవరు అనుకుంటున్నారా?

బెంగాలీ యాక్టర్ జిషు సేన్ గుప్తా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన తెలుగులో అనేక సినిమాల్లో నటించి మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా బాలకృష్ణ, ఎన్టీఆర్ కథానాయకుడు, ఆచార్య సినిమాలో నటించి తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. కాగా, ఈ నటుడు కూడా తన 20 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పి, తన భార్యకు విడాకులు ఇవ్వడానికి రెడీ అయ్యాడని ఓ వార్త తెగ వైరల్ అవుతోంది.

దీనికి కారణం నటుడి కూతురే. నటుడి భార్య నీలాంజన, తన భర్తతో పదే పదే గొడవలకు దిగడమే విడాకులకు కారణం అయ్యిందంట. అంతే కాకుండా ఆమె ఇటీవల నటుడిని అన్ ఫాలో చేసింది. ప్రస్తుతం తన కూతురు సారా కూడా తండ్రిని అన్ ఫాలో చేయడంతో ఈ పుకార్లు నిజమే అంటున్నారు కొందరు. అంతే కాకుండా నీలాంజన ఇటీవల తన కూతుర్లు సారా, జరా, సోదరి చందనాతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి వీరే నా బలం అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో నిజంగానే జిషు సేన్ గుప్త తన భార్యతో విడిపోయాడు అంటున్నారు కొందరు. కాగా, దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

Advertisement

Next Story