రాశీఖన్నాతో అలా ఒక్కసారి చేశా నా వల్ల కాలేదు.. టాలీవుడ్ డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్

by Disha Web Desk 6 |
రాశీఖన్నాతో అలా ఒక్కసారి చేశా నా వల్ల కాలేదు.. టాలీవుడ్ డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ నటుడు అవసరాల శ్రీనివాస్ పలు చిత్రాల్లో నటించి మెప్పించాడు. ఆ తర్వాత రాశీఖన్నా, నాగశౌర్య జంటగా నటించిన ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో డైరెక్టర్‌గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఇక అప్పటి నుంచి పలు మూవీస్‌ను తెరకెక్కిస్తూ డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అవసరాల శ్రీనివాస్ హీరోయిన్‌ రాశీఖన్నాపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ‘‘రాశీఖన్నా కార్ డ్రైవ్ చేస్తే నేను కూర్చొను. ఎందుకంటే దానికి ఓ బలమైన కారణం ఉంది. నేను ఆమెతో సినిమా తీసే సమయంలో ఓ సారి కార్‌లో వెళ్లాను. ఇక అప్పుడే అర్థం అయింది.

ఆమె డ్రైవింగ్ గురించి. స్టంట్ మాస్టర్ కన్నా దారుణంగా డ్రైవ్ చేస్తుంది. ఒక్కసారి ఆమె కార్‌లో వెళ్లా మళ్లీ నా వల్ల కాలేదు. ఇంకెప్పుడు కూడా ఆమె డ్రైవ్ చేస్తే కార్ ఎక్కకూడదని డిసైడ్ అయ్యాను. అంత దారుణంగా ఆమె డ్రైవింగ్ ఉంటుంది’’ అంటూ చెప్పుకొచ్చాడు. అవసరాల శ్రీనివాస్ ఫన్నీగా చెప్పినప్పటికీ.. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.



Next Story