- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మళ్లీ చికుల్లో టాలీవుడ్ నటి హేమ.. కలకలం సృష్టిస్తున్న ఫొటో.. అసలేం జరిగిందంటే?
దిశ, సినిమా: టాలీవుడ్ నటి హేమ ఇటీవల జరిగిన బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయినప్పటికీ తను హైదరాబాద్‌లోనే ఉన్నట్లు వాధించింది. అయినప్పటికీ ఈ పార్టీకి హేమ వెళ్లినట్లు ఆరోపణలు రావడంతో బెంగళూరు పోలీసులు ఆమెపై ఫోకస్ పెట్టారు. చివరికి హేమను డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్‌కు ముందు హేమ తను అసలు అక్కడికి వెళ్లలేదని పలు వీడియోలు షేర్ చేసింది. అంతేకాకుండా తను తప్పు చేయనప్పుడు ఏం చేసుకుంటారో చేసుకోండి అని సవాల్ చేసింది. అయినప్పటికీ అరెస్టు అయి జైలుకు వెళ్లడంతో కొన్ని రోజులు ఈ వార్తలు నెట్టింట సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. జూన్ 14న హేమ బెయిల్ మీద బయటకు వచ్చింది. దీంతో కథ సుకాంతం అయినట్లుగా హేమకు సంబంధించిన వార్తలకు చెక్ పడినట్లు అయింది.
ఈ క్రమంలో.. తాజాగా, హేమకు సంబంధించిన ఓ ఫొటో కలకలం సృష్టిస్తోంది. ఇటీవల డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన డిజే సిద్దార్థ్‌తో కలిసి దిగిన పిక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ కేసులో ఇతడితో పాటు 16 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అలాంటి వ్యక్తితో జైలు శిక్ష అనుభవించి వచ్చిన హేమ ఫొటో దిగడంతో అది చూసిన వారంతా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హేమకు, సిద్దార్థకు బెంగళూరు రేవ్ పార్టీకి లింక్ పెడుతున్నారు. డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా పట్టుబడిన సిద్దార్థతో ఫొటో దిగిందంటే ఆమె కూడా ఇక్కడ డ్రగ్స్ తీసుకుంటుందా? అని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. అలాగే సిద్దార్థ్ కేసులో హేమను లాగుతూ దూరంగా ఉండకపోతే చిక్కుల్లో పడటం ఖాయం అని అంటున్నారు.