హైదరాబాద్ పోలీసులకు నేను దొరికి పోయా: kamal kamaraju

by Hamsa |   ( Updated:2023-01-21 04:11:01.0  )
హైదరాబాద్ పోలీసులకు నేను దొరికి పోయా: kamal kamaraju
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ నటుడు కమల్ కామరాజు ఆవకాయ బిర్యానీ, గోదావరి వంటి సినిమాల్లో హీరోగా నటించాడు. ఆ తర్వాత ఛత్రపతి, కాటమరాయుడు, మహర్షి, నాట్యం వంటి చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. తాజాగా, కమల్ కామరాజు ఓ ట్వీట్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. ''అందరికీ చెప్తాను. ఇవాళ నా బైక్ స్పీడు పెంచి దొరికిపోయాను. పొద్దున్నే ఖాళీ రోడ్ చూసి ఆత్రుత ఆపుకోలేక 60 లో వెళ్లాల్సిన వాడిని 80లో వెళ్లాను. ఇంత పొద్దున్న సమయంలో కూడా నేను స్పీడుగా వెళ్లడాన్ని పట్టుకుని నాకు చలాన్ పంపిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు, వారు అభివృద్ధి చేసిన పద్ధతులకు ధన్యవాదాలు'' అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా తాను బైక్‌పై స్పీడ్‌గా వెళ్లిన ఫొటోను కూడా షేర్ చేశాడు.

Also Read...

నా జీవితంలో ఉన్న చీకటికి.. వెలుగులు నింపేది నువ్వే: శ్రీజ

Advertisement

Next Story

Most Viewed