ఈ రోజు పవన్ కళ్యాణ్ అభిమానులకు చాలా ప్రత్యేకం.. ఎందుకంటే?

by Shiva |   ( Updated:2023-10-11 05:40:37.0  )
ఈ రోజు పవన్ కళ్యాణ్ అభిమానులకు చాలా ప్రత్యేకం.. ఎందుకంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : ఇజం అంటే జీవితంపై ఒక దృక్పథం, ఒక అవగాహన, ఒక ఫిలాసఫీ. ప్రజల హితం గురించి ఆలోచించే ప్రతి వ్యక్తి ఏదో ఒక ఇజం‌ను ఫాలో అవుతుంటాడు. కానీ, తాను ఎంచుకున్న పంథా తన ఆలోచనకు అనుగుణంగా ఉంటే.. అదే 'ఇజం'. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలను పట్టి ఊపేస్తున్న 'ఇజం.. పవనిజం'. నిన్ను నిన్నుగా ప్రేమిస్తూనే.. ఎదుటి వారిని ప్రేమించడం, దేశాన్ని ప్రేమించడమే 'పవనిజం'. భావోద్వేగాలు, స్వలాభం, ప్రజాహితమే 'పవనిజం'. పవన్ కళ్యాణ్‌లోని మంచితనం, దార్శనికత, రచయిత, అధ్యాత్మికత 'పవనిజం‌'కు బాటలు వేశాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేశాయి. సరిగ్గా ఇదే రోజు ఆయన మొదటి సినిమా 'అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి' రిలీజైన రోజు. అందుకే పవర్ స్టార్ అభిమానులు ఈ రోజును 'పవనిజం డే'గా వ్యవహరిస్తారు.

పవన్ కళ్యాణ్.. ఆ పేరులోనే ఓ బేస్ ఉంది, అందుకే ఆయన పవర్ స్టార్ అయ్యారు. చిరుత లాంటి కళ్లు, తూటాల్లాంటి మాటలు, చేతల్లో గట్స్ ఆయన సొంతం. మెగాస్టార్ చిరంజీవి సోదరడిగా సినీ ఇండస్ట్రీలోకి వచ్చినా.. తనకంటూ బ్రాండ్, సపరేట్ ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నారు. ముఖ్యంగా యువతకు రోల్ మోడల్‌గా మారిపోయి ట్రెండ్ సెట్ చేశారు. 'నేడు పవనిజం డే' కావడంతో ఆయన అభిమానులు వివిధ సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నిరుపేదలకు ఆర్థిక సాయం చేస్తూ.. ఆదుకుంటున్నారు. అన్నదానాలతో ఆకలి కడుపులను నింపుతూ 'పవనిజం' అనే పదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.




Advertisement

Next Story

Most Viewed