నేడు యంగ్ హీరో siddarth పుట్టినరోజు..

by Hamsa |   ( Updated:2023-04-17 03:29:22.0  )
నేడు యంగ్ హీరో siddarth పుట్టినరోజు..
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ ఏప్రిల్ 17న 1979 లో జన్మించాడు. సిద్ధార్థ్ బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో స్టడీస్ పూర్తి చేసిన తర్వాత 2003లో ‘బాయ్స్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం కమల్ హాసన్ భారతీయుడు-2 సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే సిద్ధార్థ్ హీరోయిన్ అతిధి రావ్ హైదరి ప్రేమలో పడ్డట్టు గత కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఇద్దరు అధికారికంగా స్పందించలేదు. కాగా ఇండస్ట్రీలో జరిగే కొన్ని కార్యక్రమాలకు సిద్ధార్థ్, అతిది చెట్టాపట్టాలేసుకుని వెళ్తున్నారు. దీంతో వీరు నిజంగానే ప్రేమలో ఉన్నట్లు త్వరలో పెళ్లి కూడా చేసుకుంటున్నారని నెటిజన్లు అనుకుంటున్నారు. బాయ్స్, చుక్కల్లో చంద్రుడు, బొమ్మరిల్లు, ఆట, కొంచెం ఇష్టం-కొంచెం కష్టం, ఓయ్, అనగనగా ఓ ధీరుడు, బావ, ఓ మై ఫ్రెండ్, ‘బాద్ షా’ వంటి చిత్రాల్లో లో నటించాడు. నటునిగా, గాయకునిగా, నిర్మాతగా, రచయితగా ప్రేక్షకులను అలరించాడు.


ఇవి కూడా చదవండి:

Chiyaan vikram: నేడు చియాన్ విక్రమ్‌ బర్త్ డే

Advertisement

Next Story