నేడు మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పుట్టినరోజు

by Prasanna |
నేడు మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పుట్టినరోజు
X

దిశ, సినిమా: మ‌ణిశ‌ర్మ‌.. ఒకప్పుడు ఈ పేరు పెద్ద బ్రాండ్. తెలుగులో కొత్త మూవీ ఏది వచ్చిన పోస్టర్లో మణిశర్మ తప్ప వేరే పేరు కనిపించేది కాదు దాదాపు స్టార్ హీరోల సినిమాలన్నింటికి సంగీతాన్ని అందించారు. మూవీ కథ పరంగా హిట్ కాకపోయిపోయిన మ్యూజికల్ హిట్స్ అందించిన ఏకైక సంగీత దర్శకుడు మ‌ణిశ‌ర్మ‌. ఇప్పటికి 200 కి పైగా సినిమాలకు సంగీతం అందించారు. మణిశర్మ అసలు పేరు నమండ్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ. కేవలం సినిమా స్క్రీన్ నేమ్ కోసం మణి శర్మగా మార్చుకున్నట్టు ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు. మణిశర్మ బాల్యం మొత్తం చెన్నెలోనే.. ఇక ఐదురుగు సంతానంలో మణిశర్మ చిన్నవాడు. ఈయన 11 జూలై 1964లో జన్మించారు. చిన్నప్పటి నుంచి సంగీతమంటే ప్రాణం. తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ సినిమాలకి కూడా సంగీత దర్శకుడిగా పనిచేసారు. కొంత కాలం గ్యాప్ తీసుకుని రామ్ హీరోగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ మూవీతో మన ముందుకొచ్చి మళ్లీ తన ఫామ్ ని కొనసాగిస్తున్నాడు. నేడు తన 60 వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు.

Advertisement

Next Story