Mumait Khan: నేడు హాట్ బ్యూటీ ముమైత్ ఖాన్ పుట్టినరోజు

by Prasanna |   ( Updated:2024-09-01 14:18:03.0  )
Mumait Khan: నేడు హాట్ బ్యూటీ ముమైత్ ఖాన్ పుట్టినరోజు
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు నటీ ముమైత్ ఖాన్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ హాట్ బ్యూటీ 1985 సెప్టెంబర్ 1 న జన్మించింది. ఈమె కెరీర్ మోడల్ నుంచి మొదలు పెట్టి నటిగా సినిమా వరకు వెళ్ళింది. ఆమె తెలుగు , హిందీ , తమిళం, కన్నడ భాషా చిత్రాలలో అనేక ఐటెమ్ పాటల్లో కనిపించింది . మహేష్ బాబు హిట్ మూవీ పోకిరి సినిమాలో ఇప్పటికింకా నా వయస్సు నిండా పదేహారేళ్ళు అనే ఐటెం పాట చేసి అందరితో చిందులు వేపించింది. ఈ ఒక్క పాట ఆమె సినీ కెరీర్ ని మొత్తం మార్చేసింది. ఆ తర్వాత వరుస అవకాశాలతో దూసుకెళ్లింది. వ్యక్తిగతంగా ఎన్నో కష్టాలను అనుభవించానని పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది. నేడు ఈ ముద్దుగుమ్మ పుట్టిన రోజు.. ఈ సందర్భంగా ఆమె ఫ్యాన్స్ ఫోటోలను షేర్ చేస్తూ బర్త్ డే విషెస్ చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed